ETV Bharat / state

క్యాన్సర్‌ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారు : బాలకృష్ణ - BALAKRISHNA ON CANCER HOSPITAL

బసవతారకం ఆసుపత్రిలో పీడియాట్రిక్ అంకాలజీని ప్రారంభించిన నటుడు బాలకృష్ణ - క్యాన్సర్‌ బాధితులు మనోధైర్యంతో ఉంటే కోలుకుంటారన్న బాలయ్య

BASAVATARAKAM CANCER HOSPITAL
Actor Balakrishna On Cancer Hospital (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2025, 1:36 PM IST

Actor Balakrishna On Cancer Hospital : క్యాన్సర్​ను జయించాలంటే మందులతో పాటు మనోధైర్యం చాలా అవసరమని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. అంతర్జాతీయ చైల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా బసవతారకం ఆసుపత్రిలో పీడియాట్రిక్ అంకాలజీ యూనిట్​తో పాటు పీడియాట్రిక్ అత్యవసర చికిత్స విభాగాన్ని ఆయన ప్రారంభించారు.

పీడియాట్రిక్ అంకాలజీ : ఈ సందర్భంగా పిల్లలు క్యాన్సర్ బారినపడటం దురదృష్టకరమని, చిన్న పిల్లల క్యాన్సర్​పై పోరాటం చేసేందుకు ఫండ్ రైజ్ చేస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు. అందుకోసం బసవతారకం ఆసుపత్రి సిబ్బంది ఒకరోజు జీతం ఇవ్వడం అభినందనీయం అన్నారు. 12 పడకలతో ప్రారంభమైన ప్రయాణం, ఈ స్థాయికి చేరడంలో వైద్యుల కృషి మరువలేనిదని అన్నారు. విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు. అనంతరం క్యాన్సర్​తో పోరాడుతున్న చిన్నపిల్లలకు గిఫ్టులు ఇచ్చి కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.