How to Check the Indiramma Indlu Status: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ ఏ దశలో ఉంది? సర్వే చేశారా లేదా? ఇల్లు మంజూరు అయ్యిందా లేదా? ఏ లిస్ట్‌లో వచ్చింది? అనే వివరాలు తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కేవలం ఒక్క క్లిక్‌తోనే ఈ వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం వెబ్‌సైట్ క్రియేట్ చేసింది. మరి ఆ వెబ్‌సైట్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ప్రారంభానికి ముందే అర్హుల జాబితాను ప్రకటించింది. అయితే గ్రామసభల్లో ప్రకటించిన లిస్ట్‌లో చాలా మంది పేర్లు రాకపోవటంతో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్ వేదికగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించగా, క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి రిపోర్టులు పంపించగా చాలా మందికి ఇళ్లు మంజూరయ్యాయి. అయితే మంజూరైన విషయం గానీ, ఏ జాబితాలో పేరు ఉందన్న విషయం చాలా మందికి తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి స్టేటస్ చూసుకునేందుకు ప్రభుత్వం వెబ్‌సైట్ క్రియేట్ చేసింది. ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నంబర్ లేదా రేషన్ కార్డు నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ సాయంతో ఫోన్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
ఎలా చెక్ చేసుకోవాలంటే..
- ముందుగా ఇందిరమ్మ ఇళ్ల అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. https://indirammaindlu.telangana.gov.in/applicantSearch
- సెర్చ్ బై ఆధార్ నెంబర్/ ఫోన్ నెంబర్/ రేషన్ కార్డు/ అప్లికేషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి.
- నెంబర్ ఎంటర్ చేసి Go పై క్లిక్ చేయగానే దరఖాస్తుకు సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయి.
- ఈ వివరాల్లోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా లేదా? ఏ లిస్టులో వచ్చింది? ఏ దశలో ఉంది? ఇలా అన్ని అంశాలు ఉంటాయి.
- ఒకవేళ దరఖాస్తుదారులకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నా సరే ఈ వెబ్‌సైట్ ద్వారానే ప్రభుత్వానికి తెలపాల్సి ఉంటుంది.
టోల్ ఫ్రీ నెంబర్: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌కు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలు రిజిస్ట్రర్ చేసుకునేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా తీసుకువచ్చింది. సందేహాలు నివృత్తి చేయడం, ఫిర్యాదుల స్వీకరణ కోసం 040-29390057 టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుపొచ్చు.
కేవలం రూ.5 లక్షల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి - ఈ కొలతలు పాటిస్తే చాలు!
రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకోవాలా? - ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి