Mumbai Indians IPL 2025 : 2025 ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబయి ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది జరిగిన మెగావేలంలో రూ.4.80 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాడు గాయంబారిన పడ్డాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు రానున్న ఐపీఎల్‌కు గానూ దూరం కానున్నాడు. దీంతో ముంబయి యాజమాన్యంతోపాటు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే?
గత సీజన్లో పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయిన ముంబయి, ఈసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే జట్టును తయారు చేసుకుంది. ఇందులో భాగంగానే ఆఫ్గానిస్థాన్‌కు చెందిన 18ఏళ్ల స్పిన్నర్ అల్లాగ్ గజన్‌ఫర్‌ను మెగా వేలంలో భారీ ధరకు దక్కించుకుంది. ఈ యంగ్ మిస్టరీ స్పిన్నర్‌పై ముంబయి భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే రీసెంట్గా జరిగిన జింబాబ్వే పర్యటనలో గజన్‌ఫర్ వెన్నుముకకు గాయమైంది. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు 2025 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
జెట్ స్పీడ్‌లో వచ్చినా!
దేశవాళీలో రాణించిన గజన్‌ఫర్‌కు తక్కువ సమయంలోనే అంతర్జాతీయ పిలుపు వచ్చింది. జాతీయ జట్టులో అరంగేట్రం చేసిన గజన్‌ఫర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 11 వన్డేల్లో 21 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో సైతం స్థానం దక్కించుకున్నాడు. అలా జెట్ స్పీడ్‌లోనే ఐసీసీ టోర్నీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ, ఇంతలోనే గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక గజన్‌ఫర్ స్థానంలో నంగ్యాల్ కరోటిని అఫ్గాన్ ఎంపికచేసింది.
గతేడాది ఒమన్‌లో జరిగిన మెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్‌లోనూ గజన్‌ఫర్ ఆడాడు. ఈ టోర్నీ సెమీస్‌లో భారత్- అఫ్గాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గజన్‌ఫర్ రెండు వికెట్లతో రాణించాడు. అతడు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో రఫ్పాడించాడు. 6.3 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. అతడి దెబ్బకు బంగ్లా 143 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లోనూ రాణింస్తాడని ముంబయి భావించింది. కానీ, తాజా అతడు టోర్నీకి దురం అవ్వడంతో ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.
క్రికెట్ వదిలేసి కెనడాకు! - కట్ చేస్తే ముంబయి రూ.5.25 కోట్లకు కొనేసింది!
ఫైనల్లో SRHకు షాక్- మళ్లీ రన్నరప్‌గానే- పాపం కావ్య ఫీలైందిగా!