ETV Bharat / sports

'సూర్యకుమార్​కు అస్సలు ఈగో లేదు- వేలంలో రూ.25 కోట్లు వచ్చేవి!'

ముంబయి రిటెన్షన్స్​పై ఆకాశ్ రియాక్షన్- బుమ్రా, పాండ్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

2025 IPL Suryakumar Yadav
2025 IPL Suryakumar Yadav (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

2025 IPL Suryakumar Yadav : 2025 ఐపీఎల్ రిటెన్షన్స్​లో ముంబయి ఇండియన్స్​ చురుగ్గా వ్యవహరించిందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్, జస్పీత్ బుమ్రా​ను ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు. టీమ్ఇండియా టీ20 కెప్టెన్ అయినప్పటికీ, అతడు ఈగో (Ego) పక్కనపెట్టి హార్దిక్ పాండ్య సారథ్యంలో ఆడేందుకు సిద్ధమయ్యాడని మెచ్చుకున్నాడు. అలాగే పేసర్ బుమ్రా అనుకొని ఉంటే వేలంలో రూ.25 కోట్లు దక్కేవని అన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్​లో ఆకాశ్ వ్యాఖ్యానించాడు.

'రిటెన్షన్స్​లో ముంబయి అద్భుతంగా వ్యవహరించింది. బుమ్రా వేలంలోకి వెళ్లి ఉంటే రూ.25 కోట్లు ధర పలికేవాడు. ఒకవేళ తనకు రూ.25 కోట్లు కావాలని ఏ ఫ్రాంచైజీని అడిగినా ఆలోచించకుండా ఇచ్చేస్తారు. నాకు తెలిసి రిటెన్షన్స్​ కంటే ముందు బుమ్రాను ఇతర ఫ్రాంచైజీలు సంప్రదించాయని అనుకుంటున్నా'

'అలాగే ముంబయిలో ప్రస్తుతం సూర్యకుమార్​ కెప్టెన్ కాదు. అందుకే ఇతర ఫ్రాంచైజీలు అతడిని కూడా సంప్రదించాయని అనుకుంటున్నా. హార్దిక్ ముంబయికి కెప్టెన్ అయితే, సూర్య టీమ్ఇండియా టీ20 సారథి. అయినప్పటికీ ఎలాంటి ఈగో లేకుండా హార్దిక్ కెప్టెన్సీలో ఆడడానికి సూర్య రెడీ అయిపోయాడు. అది కూడా రూ.16.35 కోట్లకే. అతడు కూడా వేలంలోకి వెళ్లాలనుకుంటే రూ.25 కోట్లు దక్కించుకునేవాడు. అలాగే ఇతర జట్టుకు కెప్టెన్ కూడా అయ్యేవాడు' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

కాగా, రీసెంట్​ రిటెన్షన్​లో ముంబయి ఇండియన్స్​ స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మను ముంబయి అట్టిపెట్టుకుంది. ఇందులో అందరికంటే ఎక్కువగా బుమ్రా రూ.18 కోట్లు అందుకోగా, సూర్య, పాండ్యను రూ.16.35 కోట్లకు అట్టిపెట్టికుంది. ఇక నాలుగో ప్లేయర్​గా రోహిత్ శర్మకు రూ.16.30, తిలక్ వర్మకు రూ.8 కోట్లు దక్కాయి. కాగా, ఈ రిటైన్షన్స్​తో ముంబయికి రూ.75 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇంకా రూ. 45కోట్లు మిగిలి ఉన్నాయి. అలాగే ఒక రైట్ టు మ్యాచ్ కార్డు కూడా అందుబాటులో ఉంది.

బుమ్రా, సూర్యకుమార్​ కంటే తక్కువ వాల్యూ - రోహిత్ ఏమన్నాడంటే?

ముంబయి వీడనున్న సూర్యకుమార్? - ఈ స్టార్ క్రికెటర్ పైనే ఆ ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్! - Suryakumar Yadav KKR

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.