Robin Uthappa On CSK : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్రను చెన్నైలోని తమ అకాడమీలో ప్రాక్టీస్‌కు అనుమతించినందుకు ఊతప్ప సీఎస్కేపై విమర్శలు గుప్పించాడు. ఫ్రాంచైజీ క్రికెట్ కంటే దేశమే ముందుంటుందని గ్రహించాలని అన్నాడు. ఇటీవల చెన్నై వేదికగా భారత్- న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ నేపథ్యంలో ఊతప్ప తన యూట్యూబ్ ఛానెల్లో ఈ వ్యాఖ్యలు చేశాడు.
'భారత్‌తో తొలి టెస్టు సందర్భంగా కివీస్ ప్లేయర్ రచిన్ రవీంద్ర చెన్నై అకాడమీలో ప్రాక్టీస్ చేశాడు. సీఎస్కే అద్భుతమైన ఫ్రాంచైజీ. వాళ్లు తమ ప్లేయర్లను ఎప్పుడూ బాగానే చూసుకుంటారు. నాకు సీఎస్కే అంటే ఇష్టమే. కానీ, ఫ్రాంచైజీ ప్లేయర్కంటే మన దేశానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మరీ ముఖ్యంగా ఓ ఫారిన్ ప్లేయర్ మన దేశానికి వచ్చి, మన జట్టుపైనే ఆడినప్పుడు కొన్ని హద్దులు పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిని దాటకూడదు. బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల రచిన్ రవీంద్ర ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. 157 బంతుల్లో 134 పరుగులు చేశాడు. భారత్ పిచ్‌లపై ఓవర్సీస్ ప్లేయర్లు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటి. ఈ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ జట్టుకు భవిష్యత్‌లో తానే భరోసా అని నిరూపించాడు.
కాగా, చెన్నై వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు బాదిన రచిన్, రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులు నాటౌట్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే ఈ ప్రాక్టీస్ తన ప్రదర్శనకు ఎంతగానో ఉపయోగపడిందని రచిన్ రవీంద్ర మ్యాచ్ అనంతరం చెప్పాడు.
ఇక ఐపీఎల్లో రచిన్ చెన్నై తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కానీ, ఇటీవల రిటెన్షన్స్‌లో సీఎస్కే అతడిని రిలీజ్ చేసింది. దీంతో రచిన్ మెగా వేలంలోకి వచ్చాడు. ఈ వేలంలో అతడి బెేస్ప్రైజ్ రూ. 1.50 కోట్లుగా ఉంది.
ప్లేయర్‌ని తిట్టాలనుకుంటే ధోని ఏం చేస్తాడో తెలుసా? ఆన్సర్ వింటే ఆశ్చర్యపోతారు!
'అది చాలా కష్టమైంది!' : IPL 2025 ఆడటంపై క్లారిటీ ఇచ్చిన ధోనీ!