India Vs Pakistan Champions Trophy 2025 : టీమ్ఇండియాతో ఇంపార్టెంట్ మ్యాచ్ జరగనున్న సమయంలో పాకిస్థాన్ జట్టుకు మరో షాక్ తగలనుంది. రీసెంట్గా ఆ జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ గైర్హాజరయ్యాడు. దీంతో మరికొద్ది సేపట్లో జరగనున్న మ్యాచ్‌లో అతడు ఆడటంపై సర్వత్ర సందేహాలు మొదలయ్యాయి.
న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో బాబర్ 90 బంతులకు 64 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో అతడిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయితే ఈ మ్యాచ్‌లో అతడు గైర్హాజరీ టీమ్‌ను కాస్త కలవరపెట్టేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ టోర్నీకి దూరమయ్యాడు.
ఇదిలా ఉండగా, బాబర్ ప్రాక్టీస్‌కు రాకపోవడం పట్ల ఆ జట్టు తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావెద్ మీడియాతో మాట్లాడారు. అది ఒక చిన్న అంశంగా పేర్కొన్నాడు. ప్రస్తుతం జరగనున్న సెషన్ నుంచి తనకు రెస్టు కావాలని కోరినట్లు ఆకిబ్ వెల్లడించాడు.
వాళ్లకు ఫుల్ ప్రెజర్!
ఇదిలా ఉండగా, భారత్‌తో మ్యాచ్ అంటే పాక్ ఫుల్ ప్రెజర్లో ఉంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మనే నేరుగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకు చేరుకున్నారు. ప్రాక్టీస్ సెషన్ టైమ్‌లో నఖ్వీ స్టేడియంలో సందడి చేశారు. ప్లేయర్లతో ముచ్చటించి వారికి ధైర్యం చెప్పారు. టీమ్ ఇండియాపై ఎలాగైనా గెలవాలని సూచించారు.
దాదాపు రెండు గంటల పాటు జరిగిన షెడ్యూల్ చేసిన ప్రాక్టీస్ టైమ్‌లో ఈ మీటింగ్ జరగ్గా, ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత నఖ్వీ, పాక్ కెప్టెన్ రిజ్వాన్ కోచ్ ఆకిబ్ జావెద్, అలాగే ఇతర కీలక ప్లేయర్లతో భేటీ అయినట్లు తెలుస్తోంది. టీమ్ సెలక్షన్‌పై పీసీబీ చీఫ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రతి ప్లేయర్‌తో పర్సనల్‌గా మాట్లాడేందుకు ఆయన అక్కడకు వెళ్లారని సమాచారం.
భారత్ x పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ - తుది జట్టులోకి డేంజరస్ బౌలర్!