Ind vs Pak 2025 : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్ సాధించాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వన్డేల్లో 14వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. విరాట్ 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డ్ సాధించాడు. విరాట్ 287 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో వేగంగా 14 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక వరల్డ్‌వైడ్‌గా 14000+ వన్డే పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
- సచిన్ తెందూల్కర్ - 18426 పరుగులు
- కుమార సంగక్కర - 14234 పరుగులు
- విరాట్ కోహ్లీ - 14000* పరుగులు
- రికీ పాంటింగ్ - 13704 పరుగులు
- సనత్ జయసూర్య - 14430 పరుగులు