Horoscope Today February 24th 2025 : 2025 ఫిబ్రవరి 24వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో నిరుత్సాహంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకుంటే మంచిది. కుటుంబంలో ఏర్పడే చిన్న సమస్యల గురించి పట్టించుకోవద్దు. వృత్తి, వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాలలో, ఆర్థిక విషయాలలో ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు. ప్రయాణాలు ఫలవంతం. తీర్థయాత్రలలో పాల్గొని ఆధ్యాత్మికంగా గడపడం ప్రశాంతతనిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, ఆర్థికవృద్ధి ఆనందం కలిగిస్తాయి. మీదైన రంగంలో పట్టుదలతో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలం. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇంటా బయటా సానుకూల వాతావరణం ఉంటుంది. పని ప్రదేశంలో గౌరవ సన్మానాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. స్నేహితుల సహకారం ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలం కాదు. వృత్తి పరమైన సమస్యలతో మానసికంగా చాలా ఒత్తిడి అనుభవిస్తుంటారు. సన్నిహితులతో కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ పట్ల జాగ్రత్త వహించండి. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన ఉత్తమం.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. సోదరులతోనూ, సంబంధీకులతోనూ సంతోషంగా గడుపుతారు. ఒక తీర్థయాత్ర ఉండవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. విదేశాల నించి శుభవార్త అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి, నూతన పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు శుభప్రదం. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ధి ఉంది. సత్కార్యాలు చేసి ప్రశంసలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో వాదన పెట్టుకునే పరిస్థితులను రానీయకండి. వదంతులకు దూరంగా ఉండండి. గిట్టని వారు చేసే విమర్శలు పట్టించుకోవద్దు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శివారాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విచారంగా, నిరుత్సాహకరంగా ఉంటారు. సామాజిక, దైవ కార్యకలాపాలపైన విపరీతంగా ఖర్చు చేస్తారు. సంపద, ప్రతిష్టకు నష్టం కలిగే సూచనలున్నాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈశ్వరుని ఆలయ సందర్శనంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులలో అన్ని విధాలా లాభాలతో చాలా సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ప్రత్యేకంగా వ్యాపారులకు ఈ రోజు ఫలవంతమైన రోజు సమాజంలో ప్రతిష్ట, ప్రజాదరణ పెరగవచ్చు. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉన్నత పదవులు స్వీకరిస్తారు. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో సానుకూలమైన ఫలితాలను అందుకుంటారు. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభకరం.