ETV Bharat / entertainment

సమంత మెచ్చిన హీరోయిన్లు- లిస్ట్​లో సాయి పల్లవి, అలియా - SAMANTHA BEST HEROINES

అభిమానులతో ముచ్చటించిన సమంత- తనకు నచ్చిన హీరోయిన్లు పేర్లు చెప్పిన నటి

Samantha
Samantha (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2025, 11:03 AM IST

Samantha Best Heroines : ప్రముఖ నటి సమంత ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. రీసెంట్​గా మరోసారి ఇన్‌స్టాగ్రామ్​లో అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో బెస్ట్‌ హీరోయిన్స్ ఎవరో చెప్పారు.

వీరు రాక్ స్టార్స్ : సమంత
ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో బెస్ట్‌ హీరోయిన్‌ ఎవరు అని సమంతను అభిమాని ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పార్వతీ తిరువోతు (ఉల్లొళుక్కు), సాయి పల్లవి (అమరన్‌), నజ్రియా (సూక్ష్మదర్శిని), అలియా భట్‌ (జిగ్రా), అనన్య పాండే (సీటీఆర్ఎల్), దివ్య ప్రభ (ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌) అద్భుతంగా నటించారని పేర్కొన్నారు. వీరంతా రాక్‌ స్టార్స్‌ అని కొనియాడారు.

IMDB పాపులర్ లిస్ట్​లో
ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ ఇటీవల మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్ స్టార్స్ లిస్ట్ విడుదల చేసింది. 2024లో ఆ పోర్టల్​లో ఎక్కువగా సెర్చ్ చేసిన హీరో- హీరోయిన్ల లిస్ట్‌ ప్రకటించింది. ఆ లిస్టులో సమంత ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టాప్​లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ నిలిచారు.

ఇక సినిమాల విషయానికొస్తే తెరపై మహిళా ప్రాధాన్య కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సమంత. మరోవైపు ఓటీటీ వేదికగా భిన్నమైన కథలతో సత్తా చాటుతున్నారు. 'సిటాడెల్‌ : హనీ బన్నీ', 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్​లతో సమంత ఇటీవల సక్సెస్ అందుకున్నారు. 'సిటాడెల్‌ : హనీ బన్నీ' వెబ్‌ సిరీస్‌కు ఇటీవలే ఐకానిక్‌ గోల్డ్‌ అవార్డ్‌ దక్కింది. అలాగే ఉత్తమ వెబ్‌ సిరీస్‌ అవార్డును గెలుచుకుంది.

ప్రస్తుతం సమంత 'రక్త్‌ బ్రహ్మాండ్‌'తో బిజీగా ఉన్నారు. ది బ్లడీ కింగ్‌డమ్‌ అనేది ఉపశీర్షిక. 'తుంబాడ్‌' ఫేమ్‌ రాహి అనిల్‌ బార్వే ఈ వెబ్ సిరీస్​కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు తెరపైకి రాని కథతో దీన్ని రూపొందిస్తున్నారు. ఆదిత్యరాయ్‌ కపూర్‌, సమంత, వామికా గబ్బీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్​లో 'మా ఇంటి బంగారం' అనే చిత్రాన్ని గతేడాది ప్రకటించారు సమంత. ఈ సినిమా షూటింగ్ గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు.

క్రిటిక్స్ ఛాయిస్ నామినేషన్లకు సిటాడెల్ - ఆ కొరియన్ సిరీస్​కు కాంపిటిషన్​గా!

IMDB పాపులర్ లిస్ట్​లో సమంత, శోభిత! - ఆ రీజన్ వల్లనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.