ETV Bharat / offbeat

బొంబాయి రవ్వతో "వడియాలు" - చాలా ఈజీ, సూపర్​ టేస్టీ! - ఏడాదిపాటు నిల్వ! - HOW TO MAKE RAVA VADIYALU AT HOME

- ఎవరైనా ఈజీగా చేసుకునే వడియాలు - ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు

How to Make Rava Vadiyalu at Home
How to Make Rava Vadiyalu at Home (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 1:50 PM IST

How to Make Rava Vadiyalu at Home: మార్చి రాకముందే ఎండలు మండుతున్నాయి. ఎండలు ముదిరినప్పుడు చాలా మంది మహిళలు వడియాలు, అప్పడాలు పెడుతుంటారు. ఎక్కువ మొత్తం పెట్టి సంవత్సరం పాటు నిల్వ చేసుకుంటారు. ఇక వీటిని ఒక్కసారి ప్రిపేర్​ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకుని తినొచ్చు. కేవలం భోజనంలో సైడ్​ డిష్​గా మాత్రమే కాకుండా సాయంత్రం సమయంలో స్నాక్స్​గా కూడా పర్ఫెక్ట్​.

అయితే వడియాలు అంటే చాలా మందికి బియ్యం, సగ్గుబియ్యం, బియ్యప్పిండితో చేసినవి మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ బొంబాయి రవ్వతో కూడా రుచికరమైన వడియాలను ప్రిపేర్​ చేసుకోవచ్చు. వీటిని ఒక్కరైనా సరే అస్సలు కష్టపడకుండా నిమిషాల్లో పెట్టుకోవచ్చు. మరి, ఈ వడియాలు పెట్టడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • బొంబాయి రవ్వ - 1 గ్లాస్​
  • నీళ్లు - 8 గ్లాస్​లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వాము - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - 2 టీ స్పూన్లు

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి అడుగు మందంగా ఉన్న ఓ పెద్ద గిన్నె పెట్టాలి. అందులో ఒక గ్లాస్​ రవ్వకు ఎనిమిది గ్లాసుల నీరు పోసుకోవాలి.
  • నీళ్లు ఎక్కువైనా ఏమి కాదు కానీ తక్కువ అయితే రవ్వ ముద్దలాగా తయారవుతుంది. పైగా మీరు ఏ గ్లాస్​ లేదా గిన్నెతో అయితే రవ్వ తీసుకుంటున్నారో అదే గ్లాస్​ లేదా గిన్నె సాయంతో నీళ్లు తీసుకోవాలి.
  • ఈ నీళ్లలో రుచికి సరిపడా ఉప్పు, వాము, జీలకర్ర వేసి మరిగించుకోవాలి.
  • నీరు మరుగుతున్నప్పుడు రవ్వను కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  • రవ్వ పూర్తిగా ఉడికి మిశ్రమం కొంచెం దగ్గరపడుతున్నప్పుడు స్టవ్​ ఆఫ్​ చేసి పక్కన పెట్టాలి. వడియాల మిశ్రమం రెడీ అయినట్లే.
  • ఇప్పుడు వైట్​ కాటన్​ క్లాత్​ తీసుకుని తడిపి నీళ్లు లేకుండా శుభ్రంగా పిండుకోవాలి.
  • ఇప్పుడు మేడ మీద లేదా బాల్కనీలో చాప లేదా పట్టా వేసి దాని మీద తడిపిన కాటన్​ క్లాత్​ వేసుకోవాలి.
  • రవ్వ మిశ్రమాన్ని మరోసారి కలిపి చిన్న గరిటెతో సాయంతో కొంచెం క్లాత్​ మీద పరిచి స్ప్రెడ్​ చేసుకోవాలి. మరీ పల్చగా స్ప్రెడ్​ చేయకూడదు. అప్పడాల సైజ్​లో రవ్వను పరుచుకోవాలి. ఇలా మిగిలిన రవ్వ మిశ్రమాన్ని మొత్తం వడియాలుగా పెట్టుకోవాలి.
  • ఇలా పెట్టుకున్న వడియాలను సుమారు రెండు రోజుల పాటు రోజంతా ఎండలో ఉంచాలి. సాయంత్రం ఎండ తగ్గుతున్నప్పుడు తీసి ఇంట్లో పెట్టి మరునాడు ఎండ వచ్చినప్పుడు ఆరబెట్టాలి.
  • ఇవి బాగా ఎండిన తర్వాత కాటన్​ క్లాత్​ వెనుకవైపు కొంచెం తడి చేసుకుంటూ వీటిని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇలా అన్ని వడియాలను క్లాత్​ నుంచి తీసిన తర్వాత మరో రోజు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి.
  • వడియాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎండలో బాగా ఆరాలి. ఈ విషయం గుర్తుంచుకోవాలి.
  • బాగా ఎండిన వడియాలను ఎన్ని కావాలో అన్ని ఓ ప్లేట్​లోకి తీసుకుని బాగా కాగే నూనెలో వేసి వేయించుకుంటే సరి. సూపర్​ టేస్టీగా ఉండే రవ్వ వడియాలు రెడీ.

రెండు సంవత్సరాలైనా పాడవని ఊర మిరపకాయలు - ఒక్కరోజులోనే ఈ స్పైసీ సైడ్​ డిష్ రెడీ!

అటుకులతో వడియాలు.. ఓసారి రుచి చూసేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.