ETV Bharat / technology

'మేం వదిలేశాం, వాళ్లు పట్టుకున్నారు'- మైక్రోసాఫ్ట్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే! - MICROSOFTS BIGGEST MISTAKE

మైక్రోసాఫ్ట్ చేసిన అతిపెద్ద మిస్టేక్​పై సత్యనాదెళ్ల- ఏం అన్నారంటే?

Microsoft CEO Satya Nadella
Microsoft CEO Satya Nadella (Photo Credit- IANS Photo)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 24, 2025, 1:36 PM IST

Satya Nadella on Microsofts Biggest Mistake: 'సెర్చ్' ఇంజిన్​ ఆధిపత్యాన్ని అంచనా వేయడంలో విఫలమవడం తమ కంపెనీ చేసిన అతిపెద్ద మిస్టేక్ అని మైక్రోసాఫ్ట్ సీఈవో అన్నారు. అయితే గూగుల్​ మాత్రం ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి పెట్టుబడులు పెట్టి విజయవంతంగా ఈ మార్కెట్​లో తన హవా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అత్యంత విలువైన దానిని మిస్ అయిందని, అయితే గూగుల్ మాత్రం 'డొమినెన్స్ ఆఫ్ సెర్చ్​' సామర్థ్యాన్ని గుర్తించి చక్కగా అమలు చేసిందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్ సంస్థ మొదట్లో 'వెబ్' వికేంద్రీకృతమై ఉంటుందని భావించిందని, అయితే 'సెర్చ్' దాని అత్యంత విలువైన బిజినెస్ మోడల్​గా మారుతుందని గ్రహించలేదని ఆయన అన్నారు. దీన్ని ఒక విలువైన పాఠంగా పేర్కొంటూ.. "వెబ్‌లో అతిపెద్ద బిజినెస్​ మోడల్​గా మారిన దానిని మేం (మైక్రోసాఫ్ట్) కోల్పోయాం. ఎందుకంటే 'వెబ్' ఎక్కువగా విస్తరిస్తుందని మేమంతా భావించాం" అని ఆయన అన్నారు.

యూట్యూబర్ ద్వారకేష్ పటేల్‌తో జరిగిన సంభాషణలో.. గూగుల్ 'సెర్చ్' ఇంజిన్ సామర్థ్యాన్ని గుర్తించి తన స్ట్రాటజీని ఫ్లోలెస్​గా అమలు చేస్తున్న సమయంలో, మైక్రోసాఫ్ట్ సంస్థ సెర్చ్ ప్రాముఖ్యతను ఎలా తప్పుగా అంచనా వేసిందో నాదెళ్ల వివరించారు. "వెబ్‌ను నిర్వహించడంలో 'సెర్చ్' బిగ్గెస్ట్ విన్నర్ అవుతుందని ఎవరనుకున్నారు?.. మేము దానిని సరిగ్గా చూడలేదు.. అయితే గూగుల్ మాత్రం ఇది పసిగట్టి అవకాశాన్ని ఒడిసిపట్టుకుని దాన్ని బాగా అమలు చేసింది" అని నాదెళ్ల పేర్కొన్నారు.

ఈ క్రమంలో కంపెనీలు సాంకేతిక మార్పును అర్థం చేసుకోవడం మాత్రమే సరిపోదని, వాల్యూ క్రియేషన్ ఎక్కడ జరుగుతుందో కూడా గుర్తించాలని ఆయన వివరించారు. బిజినెస్ మోడల్స్​లో మార్పులకు అనుగుణంగా ఉండటం.. తరచుగా సాంకేతిక పురోగతిని కొనసాగించడం కంటే చాలా సవాలుతో కూడుకున్నదని ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ బిజినెస్ మోడల్స్​ షిఫ్ట్స్ అనేవి టెక్​ ట్రెండ్ కంటే కూడా కఠినమైనవని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మెయిన్‌ఫ్రేమ్‌ల నుంచి పర్సనల్ కంప్యూటర్​లకు మారడం, ఆ తర్వాత క్లయింట్-సర్వర్ ఆర్కిటెక్చర్ పెరుగుదల వంటి తన కెరీర్​లోని వివిధ మేజర్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్​ను గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో 'వెబ్' ఆవిర్భావం గురించి కూడా ఆయన చర్చించారు. మొజాయిక్, నెట్‌స్కేప్ బ్రౌజర్‌ల ప్రారంభం మైక్రోసాఫ్ట్‌ను ఎలా స్వీకరించేలా ఫోర్స్ చేసిందో ఆయన గుర్తుచేసుకున్నారు. అప్లికేషన్‌లను క్రియేట్ చేయడంలో కొత్త మార్గాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి కంపెనీ బ్రౌజర్ యుగానికి బాగా సర్దుబాటు చేసుకోగలిగిందని ఆయన వివరించారు. సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన నాదెళ్ల అనేక ఆవిష్కరణల వేవ్స్​ను చూశారు.

ఓపెన్​ఏఐ నుంచి 'ఏఐ ఏజెంట్​'- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

యాపిల్ లవర్స్​కు క్రేజీ అప్డేట్​- ఆండ్రాయిడ్ ఫోన్​లకు ధీటుగా ఫోల్డబుల్ ఐఫోన్!

వారెవ్వా! మైక్రోసాఫ్ట్​ 'మయోరానా' వేరీ పవర్​ఫుల్ బాస్- దశాబ్దాల సమస్యకు కూడా ఇట్టే చెక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.