Virat Kohli Century : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి క్రికెట్లో సపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంటుంది. కేవలం భారత్ నుంచే కాకుండా విరాట్‌కు వరల్డ్‌వైడ్‌గా కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. కింగ్ కోహ్లీ ఫ్యాన్‌బేస్‌కు లిమిట్స్ లేవు. దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ విరాట్‌కు 'డై హార్డ్ ఫ్యాన్స్' ఉంటారు. ఛాంపియన్స్ ట్రోఫీలో తాజా మ్యాచ్‌తో అది మరోసారి నిరూపితం అయ్యింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ సెంచరీని ఆ దేశ అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు.
దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇస్లామాబాద్‌లోని కొంతమంది అభిమానులు బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసుకొని లైవ్ మ్యాచ్ చూశారు.ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోతుందని అక్కడ కొంతమంది అభిమానులు నిరాశ చెందుతుంటే, మరికొందరు మాత్రం విరాట్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నారు. అతడు సెంచరీ మార్క్ అందుకోగానే కేరింతలు, చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. 'కోహ్లీ', 'కోహ్లీ' అంటూ హుషారుగా అరుస్తూ సంబర పడిపోయారు.
నెటిజన్ల రియాక్షన్
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి నెటిజన్లు స్పందిస్తున్నారు. పాకిస్థాన్‌లోని విరాట్ ఫ్యాన్స్ అతడి మాస్టర్ క్లాస్‌ను మెచ్చుకుంటున్నారని అన్నారు. ఇది 'బ్యూటీ ఆఫ్ క్రికెట్', క్రికెట్లో ఇది నిజమైన విజయం', 'ఒరిజినల్ కింగ్ ఎవరో వాళ్లకు తెలుసు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
اسلام آباد میں موجود کرکٹ شائقین ویرات کوہلی کی سینچری پر خوشی مناتے ہوئے https://t.co/5KyXSQMhdh pic.twitter.com/51Uliy4GNm
— Muhammad Faizan Aslam Khan (@FaizanBinAslam1) February 23, 2025
A Pakistani wearing an Indian Jersey who’s a fan of Sachin. #INDvsPAK pic.twitter.com/nubstUaqbW
— Ihtisham Ul Haq (@iihtishamm) February 23, 2025
52వ సెంచరీ
కాగా, ఈ మ్యాచ్‌లో విరాట్ 100 (116 బంతుల్లో) అదరగొట్టాడు. విరాట్‌కు వన్డేల్ల ఇది 52వ సెంచరీ కాగా, ఓవరాల్‌గా 82వ అంతర్జాతీయ శతకం. ఈ లిస్ట్‌లో విరాట్ కంటే ముందు సచిన్ తెందూల్కర్ (100 సెంచరీలు) ఒక్కడే ముందున్నాడు. ఈ మ్యాచ్‌లోనే విరాట్ మరో ఘనత సాధించాడు. తాను 22 పరుగుల వ్యక్తిగత స్కారో వద్ద ఉండగా, వన్డేల్లో 14000 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యధిక వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.
𝗞𝗢𝗛𝗟𝗜 𝗙𝗜𝗡𝗜𝗦𝗛𝗘𝗦 𝗢𝗙𝗙 𝗜𝗡 𝗦𝗧𝗬𝗟𝗘! 💯@imVkohli takes #TeamIndia over the line, bringing his first-ever hundred in the #ChampionsTrophy, his 51st in ODIs, and 82nd across formats. 🙌
— Star Sports (@StarSportsIndia) February 23, 2025
Take a bow, KING! 👑#ChampionsTrophyOnJioStar 👉 #INDvPAK | LIVE NOW on Star… pic.twitter.com/pzUmDiAtyp
ఇక మ్యాచ్ విషయానికొస్తే, భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. విరాట్‌తోపాటు శ్రేయస్ అయ్యర్ (56 పరుగులు), శుభ్‌మన్ గిల్ (46 పరుగులు) రాణించారు.
A Pakistani wearing an Indian Jersey who’s a fan of Sachin. #INDvsPAK pic.twitter.com/nubstUaqbW
— Ihtisham Ul Haq (@iihtishamm) February 23, 2025
ఆల్‌టైమ్ రికార్డ్- క్రికెట్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ వ్యూవర్షిప్- అంతా 'విరాట్' మాయే!