ETV Bharat / offbeat

IRCTC సూపర్​ ప్యాకేజీ - బ్యాంకాక్​లో ఫుల్​ ఎంజాయ్​ చేయవచ్చు! - సఫారీ వరల్డ్ టూర్ కూడా!

-తక్కువ బడ్జెట్​లో IRCTC టూరిజం సూపర్​ ప్యాకేజీలు -బ్యాంకాక్​ బీచ్​లో మస్త్​ ఎంజాయ్​ చేయవచ్చు

IRCTC Thailand Tour
IRCTC Treasures of Thailand Ex Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

IRCTC Thailand Package Details: థాయ్‌లాండ్‌.. ఇంటర్నేషనల్‌ బెస్ట్​ టూరిస్ట్‌ స్పాట్‌లలో ఇదీ ఒకటి. ముఖ్యంగా యూత్​కైతే ఫేవరెట్​ డెస్టినేషన్​. ఎందుకంటే ఇక్కడికి వెళ్తే బ్యాంకాక్‌ బీచ్‌లో ఫుల్​ ఎంజాయ్‌ చేయవచ్చు కాబట్టి. అయితే ఇంటర్నేషనల్​ టూర్​ అనగానే ధర​ ఎక్కువని అనుమానం రావడం సహజం. కానీ, ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ అందుబాటు ధరలోనే థాయ్‌లాండ్‌ అందాల్ని ఆస్వాదించేందుకు ఓ ప్యాకేజీ అందిస్తోంది. మరి ఆ ప్యాకేజీ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

"ట్రెజర్స్​ ఆఫ్​ థాయ్‌లాండ్‌ ఎక్స్​ హైదరాబాద్​(Treasures of Thailand Ex Hyderabad)" పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ యాత్ర మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ సాగుతుంది థాయ్‌లాండ్‌లో ప్రముఖ టూరిస్ట్‌ కేంద్రాలైన పట్టయ, బ్యాంకాక్‌లో పలు ప్రదేశాలను వీక్షించొచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు హైదరాబాద్​లోని రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​లో రాత్రి 9 గంటలకు రిపోర్ట్​ చేయాలి. అక్కడ ఫార్మాలిటీస్​ పూర్తి చేసుకోవాలి.
  • రెండో రోజు అర్ధరాత్రి​ 1 గంటకు హైదరాబాద్​ నుంచి బ్యాంకాక్​కు ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఉదయం 6 గంటలకు బ్యాంకాక్​ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఫార్మాలిటీస్‌ పూర్తి చేసి లగేజ్​ తీసుకుని.. అక్కడి నుంచి పట్టయకు బయలుదేరుతారు. ముందుగానే బుక్​ చేసిన హోటల్​లో చెకిన్​ అవ్వాలి. ఫ్రెషప్​ అనంతరం బ్రేక్​ఫాస్ట్​ ఉంటుంది. ఆ తర్వాత హోటల్​లోనే మధ్యాహ్నం వరకు రెస్ట్​ తీసుకుంటారు. లంచ్​ తర్వాత పట్టయలోని జెమ్స్​ గ్యాలరీ సందర్శిస్తారు. ఆ సాయంత్రం అల్కజార్‌ షోను వీక్షించి.. రాత్రి ఇండియన్​ రెస్టరెంట్​లో డిన్నర్​ చేస్తారు. ఇక ఆ రాత్రికి పట్టయలో బస ఉంటుంది.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత కోరల్​ ద్వీపంలో స్పీడ్‌ బోటింగ్‌ ఉంటుంది. అక్కడే బీచ్‌లో సేదదీరొచ్చు. లంచ్​ కూడా ఉంటుంది. సాయంత్రం నూంగ్​ నుచ్​ ట్రోపికల్​ గార్డెన్​ విజిట్​ చేస్తారు. పట్టయ తిరిగి రావడంతో ఆరోజు పూర్తవుతుంది. ఆ రాత్రికి డిన్నర్​ అక్కడే చేసి స్టే చేయాలి.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి​ సఫారీ వరల్డ్ టూర్‌ అండ్​ మెరైన్​ పార్క్​ విజిట్​ చేస్తారు. సాయంత్రానికి బ్యాంకాక్​కు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న పలు ప్రాంతాలను చూస్తారు. ఆ రాత్రి బ్యాంకాక్​లోనే స్టే ఉంటుంది.
  • ఐదో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి బ్యాంకాక్ సిటీలోని పలు ప్రాంతాలను విజిట్​ చేస్తారు. లంచ్​ తర్వాత బ్యాంకాక్‌లోని గోల్డెన్‌ బుద్ధ, మార్బుల్ బుద్ధ సందర్శిస్తారు. తర్వాత షాపింగ్‌ ఉంటుంది. సాయంత్రం ఆరు గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోని.. అక్కడి నుంచి హైదరాబాద్​కు రిటర్న్​ అవుతారు. భాగ్యనగరం చేరుకోవడంతో ఈ టూర్​ ముగుస్తుంది.

హైదరాబాద్ - థాయ్లాండ్ టూర్ ప్యాకేజీ ధరలు :

  • సింగిల్ షేరింగ్ కు రూ.64,190, డబుల్ షేరింగ్​కు రూ.55,860, ట్రిపుల్ షేరింగ్​కు రూ.55,860 గా నిర్ణయించారు.
  • చిన్నారులకు చైల్డ్​ విత్​ బెడ్​ అయితే రూ.53,860గా, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.48,860గా ధరలు ఉన్నాయి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ఫ్లైట్​ టికెట్లు (హైదరాబాద్​ - బ్యాంకాక్​ - హైదరాబాద్​)
  • హోటల్​ అకామిడేషన్​
  • 4 బ్రేక్​ఫాస్ట్​, 4 లంచ్​, 4 డిన్నర్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • సందర్శించే ప్రదేశాల ఎంట్రీ టికెట్లు
  • ప్రస్తుతం ఈ టూర్​ నవంబర్​ 9వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీ సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​ పై క్లిక్​ చేయండి.

కార్తికమాసం స్పెషల్​ - శ్రీశైలం దర్శించుకునేందుకు IRCTC సూపర్​ ప్యాకేజీ - పైగా యాదాద్రి వెళ్లొచ్చు!

కార్తికమాసంలో జ్యోతిర్లింగాలు దర్శించుకునేందుకు వీలుగా - IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర తక్కువే!

IRCTC దిల్లీ టూర్ - కృష్ణ జన్మభూమి మథురతోపాటు, మరెన్నో ప్రదేశాలు చూడొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.