ETV Bharat / state

'తండేల్‌' సినిమాలో కురవి కుర్రోడు - అసోసియేట్ డైరెక్టర్​గా రాణింపు - A YOUNG MAN EXCELLING IN MOVIES

సినిమాల్లో రాణిస్తున్న మహబూబాబాద్ జిల్లా యువకుడు - తండేల్ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్​గా పనిచేసిన శ్రీనాథ్ - దర్శకుడిగా రాణించాలనేదే లక్ష్యమని వెల్లడి

A young man excelling in movies
A young man excelling in movies (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2025, 9:47 PM IST

Young Man Excelling in Movies : అతడికి బాల్యం నుంచి సినిమాలంటే ఇష్టం. ఎప్పటికైనా చిత్రసీమలో(సినీ రంగంలో) పనిచేయాలనేది కల. షార్ట్ ఫిల్మ్​లతో తన ప్రయాణం మొదలుపెట్టారు. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకున్నారు. తన పేరు వెండితెరపై కనిపించాలని అతడు అనుక్షణం పరిశ్రమించారు. శుక్రవారం విడుదలవుతున్న నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ‘తండేల్‌’ సినిమాకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

కురవికి చెందిన వ్యాపారి కొదుమూరి వెంకటేశ్వర్లు, నాగమణి దంపతుల చిన్న కుమారుడే శ్రీనాథ్‌. మానుకోటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్, బీటెక్‌ విద్యనభ్యసించారు. ఇంటర్‌ చదువుతున్న రోజుల్లోనే తిరుమలాపురం అనే గ్రామానికి చెందిన భరత్‌కుమార్‌తో కలిసి ఓ లఘుచిత్రం తీసి తన ప్రతిభ చాటుకున్నారు. లక్ష్యం నెరవేరిన అనంతరమే తాను పడిన కష్టం విలువ తెలుస్తుందని కురవికి వచ్చిన ప్రతిసారి అంటుండేవాడని శ్రీనాథ్‌ స్నేహితులు గుర్తుచేసుకున్నారు.

2021లో చిత్రసీమలోకి : కఠోర శ్రమతో సినీ పరిశ్రమలో స్థానం సంపాదించుకున్న శ్రీనాథ్‌ కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన డెవిల్‌ చిత్రానికి చీఫ్‌ అసోసియేట్​గా వ్యవహరించారు. 2023 నవంబరులో నాగచైతన్య, సాయి పల్లవి తండేల్‌ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. చిత్రంలో 5 మంది అసోసియేట్ డైరెక్టర్లు ఉండగా అందులో శ్రీనాథ్‌ ఒకరు. శుక్రవారం ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది.

"పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే సినీ రంగంలోకి వెళ్లాలని ఉండేది. బీటెక్ పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లో షార్ట్​ ఫిల్మ్​లు తీశా. మా తల్లిదండ్రులకు భయపడి యూట్యూబ్‌లో పెట్టకపోయేవాణ్ని. గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యంతోనే ఇబ్బందులు ఎదురైనా ముందుకు వెళ్లాను. డైరెక్టర్(దర్శకుడిగా) రాణించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నా"- కొదుమూరి శ్రీనాథ్‌

కురవిలో సందడి : కొదుమూరి శ్రీనాథ్‌ తండేల్‌ సినిమాలో అసోసియేట్ డెరెక్టర్‌గా పరిచయం కావడంతో కురవి మండలంలో సందడి నెలకొంది. మండలంలోని పలు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తండేల్‌ సినిమా వాల్‌ పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

తెలుగు సినిమా రంగంలో రాణిస్తున్న యువత - ఉద్యోగాలను వదిలేసి సినిమా వైపు ప్రయాణం

కళ్లు లేకున్నా కలలు సాకారం- చదువులో రాణిస్తున్న లక్కీ మిరానీ సక్సెస్‌ స్టోరీ - Lucky Mirani story

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.