IRCTC Golden Sands of Rajasthan: రాజస్థాన్ రాజసం గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్కడి కట్టడాలు, రాచరికానికి దర్పం పట్టే కోటలు, ప్యాలెస్‌లు, సరస్సులు, రాజ భవనాల అందాలు.. చూడాలే గానీ వర్ణించడానికి మాటలు సరిపోవు. ప్రముఖుల వివాహాలూ కూడా అక్కడే జరుగుతుంటాయి. అందుకే అలాంటి ప్రదేశాలను సందర్శించాలనుకునే వారు చాలా మందే ఉంటారు. అయితే అలాంటి వారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఓ అవకాశాన్ని కల్పిస్తోంది. అన్ని వసతులు ఉండే విధంగా ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఐఆర్సీటీసీ "గోల్డెన్ సాండ్స్ ఆఫ్ రాజస్థాన్" పేరుతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం ద్వారా ఈ టూర్ ఉంటుంది. ఈ ప్యాకేజీ మొత్తం 5రాత్రుళ్లు, 6 పగళ్లు ఉంటుంది. ఈ టూర్లో జైసల్మేర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ వంటి ప్రదేశాలు చూడొచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నానికి ఉదయ్‌పూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి పిక్ చేసుకుని ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్ అయిన తర్వాత లంచ్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత సిటీ ప్యాలెస్ విజిట్ చేస్తారు. అనంతరం నాథ్‌ద్వారా వెళ్తారు. అక్కడ శ్రీనాథ్జీ ఆలయాన్ని దర్శిస్తారు. ఆ తర్వాత స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ విజిట్ చేసి తిరిగి ఉదయ్‌పూర్ చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడ డిన్నర్ చేసి బస చేస్తారు.
- రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చిత్తోర్‌గఢ్ వెళ్తారు. అక్కడ కోట విజిట్ చేస్తారు. మధ్యాహ్నం తిరిగి ఉదయ్‌పూర్‌కు వెళ్తారు. అక్కడ సాయంత్రం షాపింగ్ ఉంటుంది. ఆ రాత్రికి అక్కడే స్టే చేయాలి.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి జైసల్మేర్ బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్న తర్వాత డెసర్ట్ క్యాంప్‌లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ అయ్యి లాంగేవాలా ఇండో పాక్ బోర్డర్ దగ్గరకు వెళ్తారు. అక్కడ వార్ మెమోరియల్ విజిట్ చేసి, తనోట్ మాత ఆలయం దర్శించుకుంటారు. అనంతరం తిరిగి జైసల్మేర్ బయలుదేరి హోటల్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
- ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ అనంతరం జైసల్మేర్ ఫోర్ట్ విజిట్ చేస్తారు. అనంతరం అక్కడి నుంచి జోధ్‌పూర్ బయలుదేరుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
- ఆరో రోజు టిఫెన్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి మెహరన్‌గఢ్ కోట విజిట్ చేసి ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. అక్కడి నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా హైదరాబాద్‌కు రిటర్న్ అవుతారు. భాగ్యనగరానికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధర వివరాలు ఇవే:
- కంఫర్ట్‌లో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.46,850, డబుల్ ఆక్యూపెన్సీకి రూ.36,300, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.35,000 చెల్లించాలి.
- 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.32,500, విత్ అవుట్ బెడ్ అయితే రూ.29,150, 2 నుంచి 4 సంవత్సరాల చిన్నారులకు విత్ అవుట్ బెడ్ అయితే రూ.23,050 పే చేయాలి.
ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- ఫ్లైట్ టికెట్లు
- హోటల్ అకామిడేషన్
- మీల్స్: 5 బ్రేక్‌ఫాస్ట్, 1 లంచ్, 5 డిన్నర్
- ప్యాకేజీని బట్టి సైట్ సీయింగ్ కోసం వెహికల్
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- ప్రస్తుతం ఈ ప్యాకేజీ 2025 జనవరి 19వ తేదీన తేదీన అందుబాటులో ఉంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
దుబాయ్ బుర్జ్ ఖలీఫా టూర్ - IRCTC అద్భుతమైన ప్యాకేజీ - ఇంకా మరెన్నో ప్రదేశాలు!
IRCTC మహా కుంభమేళా ప్యాకేజీ - తక్కువ ధరలోనే అయోధ్య, వారణాసి కూడా!
"మంచు కురిసే వేళలో కశ్మీరీ లోయలో" - IRCTC అద్భుతమైన ప్యాకేజీ - ధర కూడా తక్కువేనండోయ్!