IRCTC Golden Triangle Package : వందేళ్ల చరిత్ర దేశ రాజధాని దిల్లీకి సొంతం. ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేయడానికి ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు ఉన్నాయి. అందుకే దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. మరి మీరు కూడా ఆ ప్రదేశాలను విజిట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఓ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ టూర్ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఐఆర్సీటీసీ టూరిజం "గోల్డెన్ ట్రయాంగిల్(Golden Triangle)" పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ ద్వారా ప్రయాణం ఉంటుంది. ప్యాకేజీ ప్రకటించిన తేదీలకు అనుగుణంగా ప్రతీ బుధవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. దిల్లీ, జైపూర్, ఆగ్రాలోని పలు ప్రదేశాలను సందర్శించవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రయాణం(ట్రైన్ నెం. 12723) మొదలవుతుంది. ఆ రోజు మొత్తం జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 8 గంటలకు దిల్లీ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి హోటల్‌కు చేరుకుని చెకిన్ అయ్యి ఫ్రెష్ అవుతారు. ఆ తర్వాత దిల్లీలోని కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, అక్షరధామ్ సందర్శిస్తారు. ఆ రాత్రికి ఆ హోటల్లోనే బస చేస్తారు.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత రెడ్ ఫోర్ట్, తీన్‌మూర్తి భవన్, రాజ్ ఘాట్, ఇండియా గేట్‌ను సందర్శిస్తారు. ఆరోజు కూడా దిల్లీలోనే స్టే చేస్తారు.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి జైపూర్‌కు బయలుదేరుతారు. అక్కడి చేరుకుని హోటల్లో చెకిన్ అయ్యి హవా మహల్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత షాపింగ్ చేసుకుని.. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
- ఐదో రోజు అమీర్ ఫోర్ట్, జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్ విజిట్ చేస్తారు. ఆ రాత్రికి జైపూర్‌లో ఉంటారు.
- ఆరో రోజు ఉదయం జైపూర్ నుంచి ఆగ్రాకు బయలుదేరుతారు. మార్గమధ్యలో ఫతేపూర్ సిక్రీ విజిట్ చేస్తారు. ఆగ్రాకు చేరుకుని అక్కడ హోటల్లో చెకిన్ అయ్యి ఆ నైట్ అక్కడే బస చేస్తారు.
- ఏడో రోజు తెల్లవారుజామున తాజ్‌మహల్ సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి ఆగ్రా ఫోర్ట్ సందర్శిస్తారు. ఆ సాయంత్రం ఆగ్రా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు రిటర్న్ జర్నీ(ట్రైన్ నెం. 12724) స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రంతా జర్నీ ఉంటుంది.
- ఎనిమిదో రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధరలు చూస్తే: 1 నుంచి 3 ప్రయాణికులకు..
- కంఫర్ట్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ.58,340, డబుల్ షేరింగ్‌కు రూ.32,640, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.25,420 నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.18,440, విత్ అవుట్ బెడ్ అయితే రూ.17,320 చెల్లించాలి.
- స్టాండర్డ్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ.55,290, డబుల్ షేరింగ్‌కు రూ.29,590, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.22,370 నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.15,390, విత్ అవుట్ బెడ్ అయితే రూ.14,260 చెల్లించాలి. గ్రూప్ బుకింగ్‌పై రేట్లు కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది.
ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- ట్రైన్ టికెట్లు(హైదరాబాద్ - దిల్లీ/ ఆగ్రా - హైదరాబాద్)
- హోటల్ అకామిడేషన్
- 5 బ్రేక్‌ఫాస్ట్‌లు
- ప్యాకేజీని బట్టి సైట్ సీయింగ్ కోసం వెహికల్
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- ప్రస్తుతం ఈ ప్యాకేజీ జనవరి 8, 15, 22, 29 తేదీల్లో అందుబాటులో ఉంది.
- టూర్ పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
"మంచు కురిసే వేళలో కశ్మీరీ లోయలో" - IRCTC అద్భుతమైన ప్యాకేజీ - ధర కూడా తక్కువేనండోయ్!
చూపు తిప్పుకోలేని ఖజురహో అందాలు చూసేందుకు - IRCTC అద్భుత ప్యాకేజీ - ధర చాలా తక్కువ!!