ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పొలంబాట - రైతన్న కష్టానికి సలామ్ - MANDAMARRI SCHOOL STUDENTS

పొలం బాట పట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు - పంట పొలాలు, పండ్ల తోటల సందర్శన - రైతులు పడుతున్న కష్టాలను విద్యార్థులకు వివరించిన ఉపాధ్యాయులు

MANCHERIAL DISTRICT
MANDAMARRI SCHOOL STUDENTS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 9:06 PM IST

Mandamarri Govt School Students : ప్రభుత్వ పాఠశాలలో సైన్సు పాఠాలు చెప్పే ఓ ఉపాధ్యాయుడికి ఒక ఆలోచన తట్టింది. వ్యవసాయం గురించి పాఠాలు చెప్పడం కంటే పొలంలోకి విద్యార్థులను తీసుకువెళ్తే వారికి ఎక్కువ లాభం చేకూరుతుందమోనని భావించాడు. ఇలా అనుకోగానే మరుసటి రోజు విద్యార్థులకు విషయాన్ని చెప్పాడు. అంతే నిత్యం పాఠ్య పుస్తకాలతో కుస్తీలు పట్టే విద్యార్థులు పొలంబాట పట్టడానికి మంచి ఆసక్తి చూపారు.

వరినాట్లు వేస్తూ సందడి : పాఠశాలకు సమీపంలోని శంకర్ పల్లి గ్రామంలోని ఓ వ్యవసాయ పొలం దగ్గరికి తీసుకువెళ్లగా అక్కడ కొంతమంది వ్యవసాయ కూలీలు వరినాట్లు వేస్తున్నారు. వారిని చూసి విద్యార్థులు కూడా పొలంలోకి దిగి నారు తీసి వరి మొక్కలను నాటారు. ఈ ఆసక్తికర సంఘటన జరిగింది ఎక్కడో కాదు మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రిలోనే. వరి నాట్లు వేసిన అనంతరం విద్యార్థులు పంట పొలాలు, పండ్ల తోటలను సందర్శించారు. నారుమడిలో వరి మొక్కలను సేకరించి నాటు వేస్తూ పిల్లలందరూ సందడి చేశారు.

"పుస్తకాలలో ఉన్న పాఠ్యాంశాలను నాలుగు గోడల మధ్యే కాకుండా ప్రత్యక్షంగా చూడడం వల్ల విద్యార్థులకు మరింత జ్ఞానం పెంపోందుతుంది. ఇక్కడి వ్యవసాయ పొలాలు, రైతులు, చేపల చెరువులను వారికి చూపించడం జరిగింది. రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూడడం ద్వారా భవిష్యత్తులో విలువలతో కూడినటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు" -భీం పుత్ర శ్రీనివాస్, ఉపాధ్యాయుడు

అన్నదాతల కష్టాలు : చెరువుల్లో చేపల పెంపకం, కూరగాయలు సాగు, పండ్ల తోటను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వీటిని పండించేందుకు రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. అన్నదాతలు దేశానికి వెన్నెముక అని వివరించారు. చివర్లో దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు విద్యార్థులంతా నమస్కరించి వారి శ్రమను అభినందించారు.

తక్కువ కూలీ, ఎక్కువ పని - వరినాట్లలో నాన్ లోకల్ హవా

ఎకరం భూమిలో 60 రకాల పంటలు సాగు - మల్టీలేయర్​ ఫార్మింగ్​తో ఏటా రూ.8లక్షలు సంపాదిస్తున్న యువరైతు! - Multi Layer Farming Model

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.