ETV Bharat / business

బడ్జెట్​పై కోటి ఆశలు- పేద, మధ్యతరగతి వర్గాలపై వరాలు కురిసేనా? - BUDGET 2025 EXPECTATIONS

బడ్జెట్​ 2025లో మహిళలు, పేదలపై వరాలు- మోదీ వ్యాఖ్యలు వాస్తవమయ్యేనా?

Budget 2025
Budget 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2025, 8:20 PM IST

Updated : Jan 31, 2025, 8:37 PM IST

Budget 2025 Expectations : వికసిత భారత్‌ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కార్‌ పేదరిక నిర్మూలన, ఆహారభద్రత, ఆరోగ్యం, సామాజిక సంక్షేమానికి అనేక పథకాలు అమలుచేస్తోంది. ఈ బడ్జెట్‌లో కొత్తవి జోడిస్తారా లేక ఉన్న వాటికే కేటాయింపులు పెంచుతారా అనే విషయమై ఆసక్తి నెలకొంది. అయితే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు పేద, మధ్యతరగతిసహా కొన్నివర్గాల్లో ఆశలు రేపాయి. వృద్ధిరేటు తగ్గినందున ఆదాయపు పన్నులో మార్పులు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

పేదల కలలు సాకారం అయ్యేనా?

  • దేశంలోని పేదకుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో 2018లో ప్రారంభమైన ప్రధానమంత్రి జనారోగ్య పథకం ద్వారా 50 కోట్ల మందికిపైగా లబ్ధి పొందుతున్నారు. దిల్లీ, పశ్చిమ బెంగాల్‌ మినహా అన్నిరాష్ట్రాలు ఈ పథకాన్ని అమలుచేస్తున్నాయి. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ దీనిని విస్తరించారు. కనుక బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగే అవకాశముంది.
  • సౌరవిద్యుత్తును ప్రోత్సహిస్తున్న కేంద్రం పీఎం సూర్య ఘర్ ముఫ్త్‌ బిజ్లీ పథకాన్ని తీసుకొచ్చింది. పైకప్పులపై సౌరవిద్యుత్తు ఉత్పత్తికి సంబంధించిన ఈ పథకం ద్వారా 78 వేల చొప్పున ఒక్కో ఇంటికి గరిష్ఠంగా 3 కిలోవాట్లకు రాయితీ ఇస్తోంది. 2026-27 నాటికి కోటి ఇండ్లు లక్ష్యంగా పెట్టుకోగా, దాదాపు 1.45కోట్లకుపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ పథకం రాయితీ కోసం బడ్జెట్‌లో కేటాయింపులు పెంచే అవకాశం ఉంది.
  • గ్రామీణ పేదల సొంతింటి కలను సాకారం చేయటమే లక్ష్యంగా పీఎం ఆవాస్‌ యోజన ద్వారా 3కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టిన కేంద్రం, రెండోవిడతలో హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ పేరుతో సాయం చేయనుంది. పట్టణప్రాంతాల్లో 2029 నాటికి కోటి మంది పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది.
  • హామీ లేని రుణాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ముద్రా పథకం 2015 ఏప్రిల్‌ 8న ప్రారంభమైంది. తరుణ్‌ కింద 10లక్షల రుణ పరిమితిని 20లక్షలకు పెంచారు. ఈసారి ఎలాంటి మార్పులు ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.
  • కొవిడ్‌ వేళ పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు మార్చి 2020లో గరీబ్‌ కల్యాణ్‌ యోజనను ప్రవేశపెట్టారు. లబ్ధిదారులకు నెలకు 5కేజీల బియ్యం, గోధుమలు అందిస్తున్నారు. ఈ పథకాన్ని 2028వరకు పొడిగించిన కేంద్రం ఈ బడ్జెట్‌లో అందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.
  • రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు 2018లో ప్రవేశపెట్టిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా ఏడాదికి రూ.6వేలు మూడు విడతల్లో అందిస్తున్నారు. ఈసారి ఈ ఆర్థికసాయం పెంచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆశలు రేపుతున్న మోదీ వ్యాఖ్యలు
ప్రధాని మోదీ చేసిన తాజా వ్యాఖ్యలు ఆయా వర్గాల్లో కొత్త ఆశలు రేపాయి. ఈ బడ్జెట్‌లో పేద, మధ్య తరగతితోపాటు మహిళలకు పెద్దపీట వేస్తారనే అంచనాలను పెంచాయి. పేదలు, మధ్య తరగతిపై మహాలక్ష్మికటాక్షం చూపించాలని ప్రధాని పేర్కొనటం ద్వారా సంకేతాలిచ్చినట్లు భావిస్తున్నారు. సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడులు, ఆవిష్కరణలే లక్ష్యంగా దూసుకెళుతున్నామని ప్రధాని మోదీ పేర్కొనటంతో ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేస్తారనే ప్రచారం మొదలైంది. ప్రతిఏటా బడ్జెట్‌ సమయంలో ఆదాయపు పన్ను ఊరట కల్పిస్తారంటూ వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తుంటారు. వృద్ధి నెమ్మదించటంతో ఈసారి మార్పులు ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

స్థిరాస్తి రంగానికి ఊరట లభించేనా?
ఈ ఏడాది ప్రవేశపెట్టే కేంద్ర వార్షిక బడ్జెట్‌పై గృహ నిర్మాణ రంగం, పట్టణ రంగానికి చెందిన వారు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ రంగం పుంజుకుంటే లక్షలాది మందికి ఉపాధి లభించడం సహా వ్యవస్థలోకి భారీగా డబ్బు వచ్చి చేరుతుంది. హౌసింగ్ రంగానికి పన్ను మినహాయింపుతో పాటు, రియల్ ఎస్టేట్‌ను పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్ల నెలకొన్న వేళ ఈ ఏడాది పద్దుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

జీఎస్​టీ మినహాయింపు?
పెద్ద పెద్ద నగరాల్లో జీఎస్​టీ వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా రూ.50 లక్షలకు ఒక ఫ్లాట్‌ కొనుగోలు చేస్తే దాదాపు రూ.9 లక్షల వరకు జీఎస్​టీ కట్టాల్సి వస్తోంది. అందుకే జీఎస్​టీని మినహాయిస్తే వారికి పెద్ద ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.

'ఇప్పటివరకు గృహ రుణాలపై రూ.2 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇస్తున్నారు. కానీ అది పాత పన్ను విధానంలో ఉంది. ప్రసుత్తం 70 నుంచి 75 శాతం మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానానికి మారారు. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. ఈ నేపథ్యంలో వడ్డీ రాయితీని కొత్త టాక్స్ విధానంలో కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది జరిగితే, రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పుంజుకునే అవకాశం ఉంది. గృహ రుణ వడ్డీలో తగ్గింపు కొనుగోలుదారులకు మద్దతు లభిస్తుంది. అలాగే గృహ రుణ వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచి మధ్యతరగతి వారు సొంతింటి కలను నిజం చేసుకునే దిశగా వారిని మరింత ప్రోత్సహించాలి' అని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ హిరానందనీ అన్నారు. స్మార్ట్‌ సిటీ మిషన్‌ను టైర్‌-2, టైర్‌-3 నగరాలకు విస్తరించాలని ఆయన కోరుతున్నారు.

ఆదాయపు పన్ను శ్లాబ్​ల్లో మార్పులు?
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం మరింత పెంచుతుందనే ఆశాభావంతో వేతన జీవులు/ఉద్యోగ వర్గాలు ఉన్నాయి. అల్ప ఆదాయ వర్గాల వారికి పన్ను మినహాయింపు పరిమితి సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా పన్ను చట్టాలను సరళీకరిస్తారని అంచనా వేస్తున్నారు. పన్ను విధానాన్ని మరింత సరళీకరించడంలో భాగంగా టాక్స్ శ్లాబుల్ని 6 నుంచి 3 శ్లాబులకు కుదించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం గరిష్ఠ పన్ను రేటు 30 శాతంగా ఉండగా, దీనిని 25 శాతానికి తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సెక్షన్ 87A కింద రూ.7 లక్షల ఆదాయం వరకు టాక్స్ రిబేట్ వర్తిస్తుండగా, దీనిని రూ.10 లక్షలకు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మధ్యతరగతి వర్గానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.బ్ధి కలుగుతుంది. వీరికి ఉపశమనం కలిగించేలా సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచే అవకాశం ఉంది.

టీడీఎస్, టీసీఎస్ నిబంధనల సరళీకరణ
మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్), మూలం వద్ద పన్ను సేకరణ (టీసీఎస్) అనేవి భారత పన్ను విధానంలోని ప్రాథమిక భావనలు. టీడీఎస్, టీసీఎస్ నిబంధనలను సరళతరం చేసే అంశంపై ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆయా నిబంధనల మధ్య సారూప్యత లేకుండా చేయడం, స్పష్టత ఉండేలా మార్చడం, సామాన్యులకూ అర్థమయ్యేలా అందుబాటులోకి తేవడం అనేవి ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. టీడీఎస్ నిబంధనల్లో పదేపదే సవరణలు చేస్తుండటంతో గతంలో పలు న్యాయవివాదాలు తలెత్తాయి. దీనివల్ల పన్ను చెల్లింపుదారులను అయోమయం ఆవరించింది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. దీనిని ఇప్పుడు ఒక లక్ష రూపాయలకు పెంచాలని వేతన జీవులు కోరుకుంటున్నారు.

Last Updated : Jan 31, 2025, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.