App for Food And Clothes Needy people : సామాజిక మాధ్యమ వినియోగం విపరీతంగా పెరిగింది. కేవలం సంభాషణలు, సందేశాల చేరవేతకే కాకుండా దీన్నో వేదికగా మలచుకుంటే సేవా కార్యక్రమాలను విస్తృతం చేయొచ్చనుకున్నారు. తమ ఆలోచనను ఉపాధ్యాయురాలితో పంచుకొని, ఆమె సహకారంలో ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించారు. పేదలకు ఆహారం, గుడ్డ అందించేందుకు 'హెల్పింగ్ హ్యాండ్స్' పేరిట యాప్‌ను తయారు చేశారు. ఇప్పటికే ఆల్ఫా వెర్షన్ పూర్తి చేసుకుని బీటా వెర్షన్ దశలోకి చేరుకుంది. త్వరలోనే పూర్తి స్థాయిలో సిద్ధమై ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
తమవంతుగా సాయం చేద్దామనుకుని : పాఠశాల నుంచి వివిధ సందర్భాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధననో భాగంగా అనాథలు, పేదలు, యాచకులకు కడుపునిండా తిండిలేక, కట్టుకునేందుకు సరైన దుస్తుల్లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించారు. వారిని ఆదుకునేందుకు తమవంతుగా ఏదైనా చేయాలనుకున్నారు ఆ విద్యార్థులు.
మరికొన్ని రోజుల్లో ఐఓఎస్‌లోకి : ఇందుకోసం సామాజిక మాధ్యమాన్ని అవకాశంగా మలుచుకోవాలనున్నారు ఆదిలాబాద్ పట్టణంలోని వాసవి వరల్డ్ పాఠశాల్లో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న జె.అవ్ని, ఇ.శాన్వికా రెడ్డి, జె.రాగప్రియ అనే విద్యార్థినులు. ఈ క్రమంలో తమకు కంప్యూటర్స్ బోధించే ఉపాధ్యాయురాలు వి.మౌనికా రెడ్డి సాయంతో యాప్‌ను రూపొందిచాలి అనుకున్నారు. థంకేబుల్ అనే ప్లాట్‌ఫాం సాయంతో యాప్ తయారీ, అవసరమైన కోడింగ్ వంటి ప్రక్రియలను పూర్తి చేశారు. పలు దశల్లో పనితీరును పరిశీలించి విజయవంతమయ్యారు. తుది దశకు చేరిన ఆ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు ప్లేస్టోర్‌లో అందుబాటులో రానుండగా, ఐఓఎస్ వినియోగదారులకు ఇంకాస్త సమయం పట్టనుంది.
అన్నదాతలకు గుడ్ న్యూస్ - ఈ యాప్‌తో పంట తెగుళ్లు, వైరస్‌లను ఇట్టే తెలుసుకోవచ్చు!
యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాక అందులో ఎన్జీవో, ఫైండ్ ఫుడ్, డొనేట్ ఫుడ్ అనే ఐచ్ఛికాలు కనిపిస్తాయి. వాటి సాయంతో మిగిలిపోయిన భోజనం దానం చేయడం లేక, ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకునేందుకు వీలవుతుంది. ఎంతమందికి సరిపోతుంది, ఏ సమయంలో తీసుకోవాలి, సంప్రదించాల్సిన ఫోన్ నంబరు వంటి వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. ఇలా ఉండటంతో దాతలను లేదా స్వీకర్తలను గుర్తించడం సులభమవుతుంది.
త్వరలో మరిన్ని సేవలు : హెల్పింగ్ హ్యాండ్స్ బృందంలో వాలంటీర్లుగా ఉన్న సభ్యులు అందుబాటులో ఉంటే మిగిలిపోయిన భోజనాన్ని అవసరమైన వారికి పంపిణీ చేస్తారు. వారు లేకపోతే స్థానికంగా ఉన్న సేవకులను జత చేస్తారు. భోజనం వృథా కాకుండా ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు, గోశాలల వివరాలు, రక్తదాతల వివరాలు కూడా ఈ యాప్‌లో పొందుపర్చి మరింత ఉన్నతీకరించనున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఇటీవల స్కూల్లో నిర్వహించిన టాలెన్షియా-2025 కార్యక్రమంలో భాగంగా సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ ఈ యాప్‌ను ప్రారంభించి విద్యార్థులను ప్రశంసించారు.
YUVA : ఇన్నోవేషన్, సొల్యూషన్స్ - ఈ రెండింటి కలయికే మహాత్మాగాంధీ వర్సిటీ టెక్నోవేషన్
YUVA : ఆనందాలు, ఆవిష్కరణలకు కేరాఫ్ 'అట్మాస్-2024' - వచ్చేసిందోచ్