ETV Bharat / bharat

వారానికి 60+గంటలు పనిచేస్తే- మానసిక, ఆరోగ్య సమస్యలు: ఆర్థిక సర్వే - OVER 60 HOUR WORK WEEK

వారానికి 60+ పని గంటలతో ఉద్యోగులకు మానసిక, ఆరోగ్య సమస్యలు తథ్యం: ఎకనామిక్ సర్వే

Over 60-Hour Work Week
Over 60-Hour Work Week (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2025, 9:13 PM IST

Over 60 Hour Work Week : ఉద్యోగుల పని గంటల పెంపు అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక సర్వే కీలక వివరాలు వెల్లడించింది. వారానికి 60 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని తెలిపింది. ఆఫీసులో రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడుపుతున్న ఉద్యోగుల్లో మానసిక రుగ్మతలు ఏర్పడే అవకాశమున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది.

సాధారణంగా ఉత్పాదకతకు పని గంటలనే కొలమానంగా పరిగణిస్తుంటారు. అంటే ఎంత ఎక్కువ సమయం పని చేస్తే, రిజల్ట్‌ అంత ఎక్కువగా వస్తుందని భావిస్తుంటారు. అయితే, డబ్ల్యూహెచ్‌వో, ఐఎల్‌ఓ సంస్థల అధ్యయనాల ప్రకారం, వారానికి 55 నుంచి 60 పని గంటలు దాటితే సదరు ఉద్యోగి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మానసికంగా కుంగిపోయే అవకాశముంది. ఇదే విషయాన్ని 2024-25 ఆర్థిక సర్వే కూడా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మానవుడి మెదడు, మనసుపై సపియన్‌ ల్యాబ్స్‌ సంస్థ చేసిన పరిశోధనను ఆర్థిక సర్వే ఉటంకించింది. ఎవరైతే కార్యాలయాల్లో రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పని చేస్తారో వారి మానసిక స్థితి, సాధారణ సమయం పని చేసేవారి కన్నా 100 పాయింట్లు తక్కువగా ఉంటుందట.

మరోవైపు ఆఫీసు వాతావరణం, సహోద్యోగులతో సత్సంబంధాలు కూడా ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయని ఆర్థిక సర్వే తెలిపింది. నెలకు కనీసం రెండు, మూడు రోజులు కుటుంబ సభ్యులు, బంధువులతో గడపడం వల్ల ఉద్యోగుల్లో ఒత్తిడి, మానసిక సమస్యలు తొలగి మెరుగైన జీవనశైలి సాధ్యపడుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులపై ఒత్తిడి, ఆందోళ కారణంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదాన్ని ఆర్థిక సర్వే ప్రస్తావించింది.

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వ్యాఖ్యలతో మొదలై!!
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఉద్యోగాలు వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని ఓ సందర్భంలో అన్నారు. దీనితో ఉద్యోగుల వర్కింగ్ అవర్స్ గురించి దేశంలో చర్చ మొదలైంది. అయితే ఇక్కడితో ఆగకుండా ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌.సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా 'పని గంటల'పై చర్చ తీవ్రమైంది. పలువురు ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు, సినీనటులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటల చొప్పున పని చేయాలని నారాయణ మూర్తి , సుబ్రహ్మణ్యన్​ లాంటివాళ్లు అంటున్నారు. పారిశ్రామికవేత్తలు, టెక్‌ సీఈవోలు కూడా దీనిపై స్పందిస్తూ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపర్చారు. అప్పుడప్పుడూ ఈ తరహా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆర్థిక సర్వే వారి వ్యాఖ్యలను తప్పుబట్టినట్లయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.