ETV Bharat / state

ట్రాఫిక్ సమస్యలకు ఇక చెక్​ - ఎక్కడ రద్దీ ఉన్నా మీ మొబైల్​కు సమాచారం - TRAFFIC PULSE SITE FOR RUSH ALERTS

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ అలెర్ట్ లాంచ్ ప్రోగ్రాం - "ట్రాఫిక్ పల్స్" పేరుతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను ప్రారంభించిన సీపీ అవినాష్ మహంతి - ట్రాఫిక్ ఇబ్బందులపై ముందుగా అలర్ట్​ చేయనున్న సైట్

Cyberabad police Launched Traffic Pulse Site for Traffic Alerts
Cyberabad police Launched Traffic Pulse Site for Traffic Alerts (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2025, 9:03 PM IST

Cyberabad police Launched Traffic Pulse Site for Traffic Alerts : ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు సైబరాబాద్ పోలీసులు "ట్రాఫిక్ పల్స్" పేరుతో ఓ కొత్త ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్లాట్‌ఫాం ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలను ముందుగా గుర్తించి ప్రయాణికులకు, వాహనదారులకు సమాచారం చేరవేస్తుంది. రియల్‌ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ తెలియడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ ప్లాట్‌ఫాం ఏంటి? ఎలా పనిచేస్తుంది? దీనివల్ల ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ముందుగానే సమాచారం : మనం ట్రాఫిక్‌లో ఎక్కడైన ఇరుక్కుంటే ముందు ప్రమాదం, ధర్నా, ఇంకేమైనా జరిగి ఉండొచ్చు అనుకుంటాం. లేదా ట్రాఫిక్‌ పోలీసులు సరిగ్గా పనిచేయకుండా ఏం చేస్తున్నారని తిట్టుకుంటాం. ఇక హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లో అయితే నిత్యం వాహనదారులు ట్రాఫిక్‌తో కుస్తీ పడుతుంటారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వీటన్నిటికి చెక్‌ పెట్టేందుకు పోలీసులు ట్రాఫిక్‌ పల్స్‌ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చారు. రహదారుల్లో ట్రాఫిక్‌ జామ్ అయినా, ప్రమాదం జరిగినా, ట్రాఫిక్‌ ఆంక్షలు, దారిమళ్లింపులున్నా ముందుగానే ప్రయాణికులను ముందే అలెర్ట్‌ చేస్తుంది. తద్వారా వారు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని ప్రయాణం సులభం చేసుకోవచ్చు. అలాగే వాహనదారులకు సరైన కారణాలు తెలియడం వల్ల ట్రాఫిక్ పోలీసులపై కూడా పాజిటివ్‌నెస్ పెరుగుతుంది.

"ట్రాఫిక్ సమస్యలపై ముందు సైబరాబాద్ సోషల్ మీడియా హ్యాండిల్స్​లో సమాచారం ఇచ్చాము. చాలామంది అందుకు స్పందించారు. అలా వెబ్​సైట్​ రూపొందించాలి అనుకున్నాం. ఐదు, ఆరు నెలల నుంచి వెబ్​సైట్​ రూపొందించాం. ఇది ట్రాఫిక్ అలర్ట్స్​ ఇస్తుంది. ఫోన్​ నంబరుతో రిజిస్టర్​ చేసుకోవాలి. ట్రాఫిక్​ ఉన్నా, దారి మళ్లింపులు ఉన్నా ఫోన్​కు పంపిస్తుంది." అవినాష్ మహంతి, సైబరాబాద్ సీపీ

రియల్​ టైమ్​ ట్రాఫిక్ అలర్ట్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్‌ అలెర్ట్ లాంచ్‌ కార్యక్రమంలో సీపీ అవినాష్ మహంతి ట్రాఫిక్‌ పల్స్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీస్‌, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ప్లాట్‌ఫాం అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ పల్స్ అంటే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అందిస్తున్న రియల్ టైమ్ ట్రాఫిక్ అలర్ట్ సర్వీస్. ఇది ట్రాఫిక్ సమస్యలను ముందుగా గుర్తించి ప్రయాణికులకు, వాహనదారులకు సమాచారం చేరవేస్తుంది. మొబైల్‌ నెంబర్, ఓటీపీ నమోదు చేసి ఇందులో రిజిస్టర్‌ అవ్వాలి.

'తనిఖీలు పెంచండి - చలానా కడితే ఓకే - లేదంటే బండి సీజ్ చేసేయండి'

ముఖ్యమైన దారుల్లో ట్రాఫిక్‌ సమాచారం, ఆంక్షలు, దారి మళ్లింపులు, మార్గదర్శకాలు, ఇతర అప్డేట్స్‌ అన్నీ వాట్సాప్, గూగుల్‌ ఆర్సీఎస్, ఎస్​ఎమ్​ఎస్​ ద్వారా సమాచారం అందుతుంది. ఈ సమాచారం స్క్రీన్‌పై ఫ్లాష్ మేసేజ్ రూపంలో డిస్‌ప్లే అయ్యేలా కూడా ఇందులో ఫీచర్స్ ఉన్నాయి. అలాగే రద్దీ కారణాలు, సాధారణ పరిస్థితికి తిరిగి రావడానికి పట్టే సమయం వంటి వివరాలను అందిస్తుంది.

ట్రాఫిక్ సమస్యలపై సూచనలు ఇవ్వొచ్చు : వాట్సాప్‌ ద్వారా ట్రాఫిక్ పోలీసులతో చాట్‌ చేసి మీ ప్రాంతంలోని ట్రాఫిక్ సమస్యల గురించి సూచనలు ఇవ్వొచ్చు. మీ ప్రయాణ మార్గాలు, ప్రయాణ పద్ధతులను బట్టి మీకు అవసరమైన అప్డేట్లు మాత్రమే పొందేలా కూడా సెటప్ చేసుకోవచ్చు. అందుకే ఈ ట్రాఫిక్‌ పల్స్‌ ప్లాట్‌ఫాంలో రిజిస్టరై సమాచారం తెలుసుకుంటూ ప్రయాణం సులభతరం చేసుకోవాలని సీపీ అవినాష్‌ మహంతి పిలుపునిచ్చారు.

సైట్​లో ఫిర్యాదు కూడా చేయవచ్చు : ఈ ట్రాఫిక్ పల్స్ సేవను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, టాన్లా ప్లాట్‌ఫార్మ్ లిమిటెడ్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కలిసి ఉచితంగా అందిస్తున్నారు. దీని వినియోగించే వారి వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందని, డేటాను ట్రాఫిక్ పల్స్ ఏ ఇతర సంస్థలతో పంచుకోదని పోలీసులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఏవైనా సమస్యలుంటే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ లేదా ట్రాఫిక్ పల్స్ వెబ్‌సైట్‌లో ఉన్న కాంటాక్ట్‌ ఫామ్‌ను ఉపయోగించొచ్చని సూచించారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారా ? - అయితే కాస్త జాగ్రత్త!

ట్రాఫిక్‌ చలానాలపై రాయితీ వార్తలు - క్లారిటీ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.