ETV Bharat / offbeat

ఒకే ట్రిప్​లో అజంతా, ఎల్లోరా, మినీ తాజ్​మహల్​ - IRCTC సూపర్​ ప్యాకేజీ! - IRCTC MARVELS OF MAHARASHTRA

- తక్కువ ధరకే ఐఆర్​సీటీసీ టూర్ - నాలుగు రోజులపాటు విహారం

IRCTC Marvels of Maharashtra Package
IRCTC Marvels of Maharashtra Package (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 2:09 PM IST

IRCTC Marvels of Maharashtra Package: చూపు తిప్పుకోనివ్వని అందాలు.. అజంతా, ఎల్లోరా గుహల సొంతం. ఈ అందాలను ఆస్వాదించాలే గానీ వర్ణించడానికి మాటలు చాలవు. అందుకే ఒక్కసారైనా ఆ శిల్ప సౌందర్యాన్ని కనులారా వీక్షించాలని చాలా మంది కోరుకుంటుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్​లో ఉన్నారా? అయితే మీకోసం.. ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్ సూపర్​ ​ప్యాకేజీ తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐఆర్​సీటీసీ టూరిజం మార్వెల్స్​ ఆఫ్​ మహారాష్ట్ర​ పేరుతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ మొత్తం 3 రాత్రులు, 4 రోజులుగా ఉంటుంది. హైదరాబాద్​ నుంచి ట్రైన్​ జర్నీ ద్వారా ఈ టూర్​ నిర్వహిస్తున్నారు. ఈ ప్యాకేజీలో ఔరంగాబాద్, ఎల్లోరా, అజంతా ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు. ప్రతి శుక్రవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

ప్రయాణం ఇలా..

  • మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్​ నుంచి సాయంత్రం 6:40 గంటలకు ట్రైన్​(అజంతా ఎక్సెప్రెస్​ - 17064) బయలుదేరుతుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు తెల్లవారుజామున ఔరంగాబాద్​ రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్​ చేసుకుని బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. బ్రేక్​ఫాస్ట్​ అనంతరం ఎల్లోరా గుహలు విజిట్​ చేస్తారు. అలాగే ఘృష్ణేశ్వర్ టెంపుల్​ని కూడా దర్శించుకుంటారు. సాయంత్రం మినీ తాజ్​మహల్​ విజిట్​ చేస్తారు. రాత్రికి హోటల్​కు చేరుకుని డిన్నర్​ చేసి అక్కడే బస చేస్తారు.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ అనంతరం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి అజంతా బయలుదేరుతారు. అక్కడ అజంతా గుహలు విజిట్​ చేస్తారు. సాయంత్రం తిరిగి ఔరంగాబాద్​కు వచ్చి అక్కడి నుంచి రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. రాత్రి 10:45 గంటలకు హైదరాబాద్​కు రిటర్న్​ జర్నీ(ట్రైన్​ నెంబర్​ 17063) స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • నాలుగో రోజు ఉదయం 10 గంటలకు కాచీగూడ రైల్వే స్టేషన్​కు చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

ధరలు చూస్తే: 1 నుంచి 3 ప్రయాణికులకు..

  • కంఫర్ట్​లో సింగిల్​ షేరింగ్​కు రూ. 23,120, ట్విన్​ షేరింగ్​కు రూ.12,760, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.10,140గా నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ. 8,700, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.6,950గా నిర్ణయించారు.
  • స్టాండర్డ్​లో సింగిల్​ షేరింగ్​కు రూ. 21,630, ట్విన్​ షేరింగ్​కు రూ.11,260, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.8,640గా నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ. 7,250, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.5,460గా నిర్ణయించారు. గ్రూప్​ బుకింగ్​ పై ఇంకొంత మేర తగ్గుతుంది.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • రైలు టికెట్లు (స్టాండర్డ్​, 3AC)
  • ప్రయాణికులకు ఏసీ వాహన సదుపాయం
  • అల్పాహారం, రాత్రి భోజనం ప్యాకేజీలో కవర్‌ అవుతాయి.
  • ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్​ 29 నుంచి జనవరి 10 వరకు అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీ సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఉత్తరాఖండ్ అందాలను వీక్షించేందుకు అద్భుత అవకాశం - తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్!

వైజాగ్​ to అండమాన్​ - IRCTC స్పెషల్​ ప్యాకేజీ - బీచ్​లో ఫుల్​ చిల్​ అవ్వొచ్చు బాస్​!

కార్తికమాసం స్పెషల్​ - అరుణాచలం TO తంజావూర్ - రూ.14వేలకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.