Skills Required To Get Job In Corporate Companies : నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల కేంద్రంగా హైదరాబాద్ నగరానికి ఎంతో కాలంగా గుర్తింపు ఉంది. రెండు దశాబ్దాలుగా ఐటీని అందిపుచ్చుకుని పది లక్షల మంది ప్రత్యేక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు దశాబ్దాలపాటు నిలకడగా ఉన్న సాంకేతికతలు ఇప్పుడు వేగంగా మారుతున్నాయి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకోవడంతో యువత కొంత వెనుకబడుతోంది. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్(హైసియా), కేపీఎంజీతో కలిసి ఇటీవల విడుదల చేసిన నివేదిక కూడా ఈ విషయమే స్పష్టం చేస్తుంది.
ఆ నైపుణ్యాలవారికి డిమాండ్ : కొత్త నైపుణ్యాలు అవసరం పెరుగుతోందని సంస్థలు చెబుతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్ పరంగా మెరుగ్గా ఉన్నారు. ఏఐ/ఎంఎల్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ నైపుణ్యాలు ఉన్నవారికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. మంచి ప్యాకేజీలు లభిస్తున్నాయి. వీరికి మధ్య, సీనియర్ లెవెల్స్‌లో ఉద్యోగావకాశాలు వేగంగా లభిస్తున్నాయి. తక్కువ, ఒక మోస్తరు నైపుణ్యాలకే పరిమితమైన వారు 74 శాతం ఉన్నారు. ప్రాబ్లం సాల్వింగ్, అడ్వాన్స్‌డ్ అనలిటికల్‌పరంగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అధిక నైపుణ్యాలు కలిగినవారు 50 శాతం కంటే తక్కువే ఉంటున్నారు.
బిజినెస్ లీడర్లు వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం, క్లౌడ్ కంప్యూటింగ్, మిషన్ లెర్నింగ్ నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అత్యధికంగా 62 శాతంతో రెగ్యులర్ టెక్ స్కిల్స్‌కు డిమాండ్ ఉంది.
విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం సంయుక్తంగా ఉద్యోగాల కోసం అవసరమయ్యే నైపుణ్యాల పెంపునకు శిక్షణ ఇస్తున్నాయి. ప్రత్యేకించి ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీపై దృష్టిసారించాయి. అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కొత్తగా సాంకేతికతలపై పట్టు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
మొదటి ఉత్తమ 10 నైపుణ్యాలు చూసుకుంటే :
- డేటా సైన్స్
- ప్రొడక్ట్ డెవలప్‌మెంట్
- క్లౌడ్ డెవలప్‌మెంట్
- అప్లికేషన్ డెవలప్‌మెంట్
- ఆటోమేషన్ ఆర్కిటెక్చర్
- ఏఐ/ఎంఎల్ లెర్నింగ్
- డేటా అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్
- బిజినెస్ ఇంటలిజెన్స్
- సొల్యూషన్ ఆర్కిటెక్చర్
కొత్తగా ఉద్భవిస్తున్న రంగాలు
- కృత్రిమమేధ(ఏఐ)/ మిషన్ లెర్నింగ్ (ఎంఎల్)
- సొల్యూషన్ ఆర్కిటెక్చర్
- క్లౌడ్ డెవలప్‌మెంట్
- బిజినెస్ ఇంటలిజెన్స్ (బీఐ)
- డేటా సైన్స్
- జెనరేటివ్ ఏఐ
ఆ రెండు కోర్సులే కాదు - ఇవి చదివినా విదేశాల్లో బోలెడు ఉద్యోగ అవకాశాలు
2030 నాటికి 78 మిలియన్ల జాబ్స్ - ఈ కోర్సులు చేస్తేనే లేకపోతే బొక్క బోర్లాపడ్డట్టే!
TCSలో 40,000 ఉద్యోగాలు - ఏఐ, కోడింగ్ నైపుణ్యాలు మస్ట్ - త్వరలోనే ప్రకటన!