మృగశిర కార్తె మొదటిరోజున చేపలు తినడం పూర్వీకుల నుంచి అనాదిగా వస్తోంది.. చేపలు ఎందుకు తింటారు అంటే వేసవి ముగియనుండడంతో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి.. వాతావరణం మార్పుల కారణంగా శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి.. వాతావరణం మార్పుల కారణంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి వ్యాధులు సంక్రమించవచ్చు.. ఇలాంటి వ్యాధుల నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాలి అంటున్నారు మన పూర్వీకులు. వైద్యులు.. మృగశిర కార్తె మొదటి రోజున తింటే ఎలాంటి వ్యాధులు రావు అంటున్నారు.. ఈ రోజు చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు. ఆస్తమా రోగులకు మంచిదని అంటున్నారు.. మృగశిర కార్తె సందర్భంగా కిక్కిరిసిపోయిన రాంనగర్ మార్కెట్. విక్రయానికి రెడీగా ఉన్న చేపలు. మృగశిర కార్తె స్పెషల్ - విక్రయానికి రెడీగా ఉన్న చేపలు