ETV Bharat / bharat

రూ.295 కోసం ఏడేళ్ల పోరాటం - బ్యాంక్​కు గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా! - JABALPUR WRONGLY DEDUCTION CASE

తన ఖాతా నుంచి రూ.295 కట్​ చేసినందుకు బ్యాంక్​పై కన్జ్యూమర్​ కోర్టులో ఓ యువకుడు ఫిర్యాదు - ఏడేళ్ల తర్వాత బ్యాంక్​కు వ్యతిరేకంగా తీర్పు

Jabalpur Consumer Court Unique Case
Jabalpur Consumer Court Unique Case (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2024, 4:21 PM IST

Jabalpur Consumer Court Unique Case : తన బ్యాంకు ఖాతా నుంచి అక్రమంగా రూ.295 కట్​ చేసినందుకు బ్యాంకుపైనే ఏకంగా ఏడేళ్ల పాటు పోరాటం చేశాడు ఓ వ్యక్తి. ఎందుకు కట్​ చేసిందో బ్యాంక్​ సరైన సమాధాన ఇవ్వకపోవడం వల్ల కన్జ్యూమర్​ కోర్టులో ఫిర్యాదు చేశాడు. అందుకోసం రూ.3 వేలకుపైనే ఖర్చు చేశాడు. ఏడేళ్ల తర్వాత కోర్టు ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పునిస్తూ రూ.295తో పాటు రూ.4వేలు పరిహారంగా చెల్లించాలని బ్యాంక్​ను అదేశించింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ఇదీ జరిగింది
పనాగర్​కు చెందిన నిశాంత్ తామ్రకార్ అనే వ్యక్తి 2017లో వాషింగ్ మెషీన్​ను ఈఎమ్​ఐ విధానంలో కొనుగోలు చేశాడు. అందుకోసం స్టేట్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాను ఉపయోగించాడు. ఒకసారి ఆ నెల కట్టాల్సిన ఈఎంఐతో పాటు అదనంగా రూ.295 కూడా కట్​ అయ్యాయి. దీని గురించి తెలుసుకునేందుకు వాషింగ్ మెషీన్ కొన్న కంపెనీ దగ్గరకు వెళ్లి అడిగాడు. అక్కడ ఆ నగదు కట్​ చేసింది మేం కాదు, బహుశా బ్యాంక్​ కట్ చేసుంటుందని వారు చెప్పారు. దీంతో బ్యాంక్​ను సంప్రదించిగా చెక్​ డిడక్షన్ ఛార్జీ కోసం రూ.295 కట్ చేసినట్లు చెప్పారు. దీనితో తాను అకౌంట్​లో తగినంత మొత్తాన్ని ఎప్పుడూ ఉంచుతానని, చెక్​ బౌన్స్ కావడానికి అవకాశం లేదని బ్యాంక్​కు తెలిపాడు. ఎలాగైనా తన రూ.295లను వెనక్కు ఇవ్వాలని కోరాడు. కాను బ్యాంక్ అందుకు ఒప్పుకోలేదు. దీనితో బ్యాంక్​ దగ్గర నుంచి తన డబ్బును తిరిగి తీసుకోవాలని నిశాంత్​ నిర్ణయించుకున్నాడు.

ఏడేళ్లుగా విచారణ
అందుకోసం లాయర్ రోహిత్​ పైగ్వార్​ను కలిసిన నిశాంత్ జరిగిందంతా చెప్పాడు. దీనిపై కన్జ్యూమర్​ కోర్టులో ఫిర్యాదు చేయొచ్చని, అందుకోసం రూ.3000లను డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎంత ఖర్చు అయినా సరే బ్యాంక్​ తన తప్పు తెలుసుకునేలా చేయాలని నిశాంత్ లాయర్​తో చెప్పాడు. దీంతో జబల్​పుర్ కన్జ్యూమర్​ కోర్టులో ఫిర్యాదు చేశాడు. 2017 నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. కానీ రూ.295 ఎందుకు కట్​ చేశారనేది మాత్రం బ్యాంక్ చెప్పలేకపోయింది. దీంతో 7 సంవత్సరాల తర్వాత నవంబర్ 29న(శుక్రవారం) నిశాంత్​కు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. రూ.295తో పాటు డిపాజిట్​ చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని బ్యాంకును ఆదేశించింది.

'రెండు నెలల్లో చెల్లించపోతే జరిమానా'
నిశాంత్​కు రూ.295తో పాటు మొత్తం రూ.4000 రూపాయలను రెండు నెలల్లో చెల్లించాలని బ్యాంక్​ను ఆదేశించినట్లు అడ్వకేట్ రోహిత్ తెలిపారు. ఆ మొత్తాన్ని రెండు నెలల్లో చెల్లించకపోతే సంబంధిత అధికారికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. ఈ తీర్పుపై నిశాంత్ స్పందిస్తూ, తాను డబ్బు కోసం ఇదంతా చేయలేదని తెలిపాడు. కేవలం బ్యాంక్​కు గుణపాఠం చెప్పడం కోసమే తాను ఇదంతా చేశానని చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.