Elon Musk's xAI Launches Grok 3: అపరకుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన కీలక ప్రకటనతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఆయనకు చెందిన ఏఐ అంకుర సంస్థ 'ఎక్స్‌ఏఐ' (xAI) ఎట్టకేలకూ తన తదుపరి తరం AI చాట్‌బాట్‌ను ప్రారంభించింది. 'గ్రోక్ 3' పేరుతో తీసుకొచ్చిన ఈ చాట్‌బాట్ మునుపటి కంటే మెరుగైన సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఈ మోడల్‌ను భూమిపైన అత్యంత తెలివైన ఏఐ టూల్‌గా మస్క్ అభివర్ణించారు. దీన్ని 'గ్రోక్ 2' కంటే పది రెట్లు ఎక్కువ కంప్యూటింగ్ పవర్‌తో అభివృద్ధి చేశారు. ఈ చాట్‌బాట్ ఎంతటి డిఫికల్ట్ లాజిక్, రీజనింగ్, డీప్ రీసెర్చ్ అండ్ క్రియేట్ వర్క్‌ను అయినా సులభంగా చేయగలదని ఆయన పేర్కొన్నారు.
ఏంటీ గ్రోక్?: గ్రోక్ అనేది ఒక ఫౌండేషనల్ AI మోడల్. ఇది ChatGPT, Copilot, Gemini వంటి ఇతర AI చాట్‌బాట్‌లకు గట్టి పోటీని ఇవ్వగలదు. గ్రోక్ ఇప్పటివరకు ఇమేజ్ ఎనాలసిస్ చేయడం, వినియోగదారుల రిక్వస్ట్లకు సమాధానాలను ఇవ్వడంలో సహాయపడటంతో పాటు అనేక జనరేటివ్ AI ఫీచర్లను కూడా అందిస్తోంది. వీటితో పాటు ఈ చాట్‌బాట్ మరో ప్రత్యేకత ఏంటంటే.. పాలిటిక్స్ నుంచి సెన్సిటివ్ టాపిక్స్ వరకు అన్ని అంశాలపై ప్రశ్నలకు ఫిల్టర్ చేయకుండా ఇది ఫన్నీగా సమాధానాలను అందిస్తుంది. అయితే ఇతర చాట్బాట్లు సేక్యూరిటీ రీజన్ల కారణంగా ఇలా చేయవు.
గ్రోక్ 3 స్పెషల్ ఫీచర్లు: 'గ్రోక్ 3' కొలోసస్ అనే సూపర్ కంప్యూటర్ సహాయంతో దాదాపు 6 నుంచి 8 నెలల పాటు శిక్షణ పొందిందినట్లు ఎక్స్‌ఏఐ తెలిపింది. అమెరికాలోని టేనస్సీలోని మెంఫిస్‌లోని ఒక డేటా సెంటర్‌లో ఉంచిన 2,00,000 GPUల (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు) క్లస్టర్‌ను ఉపయోగించి దీనికి శిక్షణ అందించినట్లు వెల్లడించింది. కంపెనీ దీన్ని 2024లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయగా ఎట్టకేలకూ ఇప్పుడు లాంఛ్ చేసింది.
'గ్రోక్ 3' లైవ్ లాంఛ్ సందర్భంగా ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. ఇది 'గ్రోక్ 2' కంటే చాలా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉందని అన్నారు. ఇది చాలా వరకు మెరుగైన, సమర్థవంతమైన పనితీరును కనబరుస్తుందని పేర్కొన్నారు. దీనితో పాటు ఈ కొత్త చాట్‌బాట్ స్మాలర్ వెర్షన్‌ను కూడా రిలీజ్ చేశారు. దీన్ని 'గ్రోక్ 3-మినీ' పేరుతో తీసుకొచ్చారు. ఇది మరింత త్వరగా స్పందించి సమాధానాలను అందించగలదని మస్క్ తెలిపారు.
'గ్రోక్ 3' ప్రీ-టెస్ట్ ఈ ఏడాది జనవరి 3న జరిగింది. ఇందులో ఈ AI మోడల్ మ్యాథమెటికల్ స్కిల్స్, కోడ్ జనరేషన్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అంశాలను పరీక్షించారు. ఈ AI చాట్‌బాట్ ప్రారంభ వెర్షన్‌కు 'చాక్లెట్' అని పేరు పెట్టారు. దీన్ని చాట్‌బాట్ అరీనాలో బ్లైండ్ టెస్ట్ కోసం సబ్మిట్ చేశారు. ఈ చాట్‌బాట్ అరీనా అనేది క్రౌడ్‌సోర్స్డ్ AI బెంచ్‌మార్కింగ్ జరిగే ఓపెన్ ప్లాట్‌ఫామ్. ఇది ఓపెన్ఏఐ O1ను పోలి ఉంటుంది. ఇదిలా ఉండగా 'గ్రోక్ 3' రీజనింగ్ అనే బీటా వెర్షన్ అనేక బెంచ్‌మార్క్‌లలో o3-mini ఉత్తమ వెర్షన్‌ను అధిగమించిందని ఎక్స్‌ఏఐ పేర్కొంది.
— Elon Musk (@elonmusk) February 18, 2025
డీప్‌సెర్చ్: ఎక్స్‌ఏఐ గ్రోక్ యాప్‌కి డీప్‌సెర్చ్ అనే కొత్త ఫీచర్‌ను కూడా జోడించింది. ఈ ఫీచర్ Xతో సహా ఇంటర్నెట్‌లోని దేనిపైన అయినా లోతైన శోధన చేసి సమాచారాన్ని అందిస్తుంది. దీని డీప్ సెర్చింగ్ ప్రాసెస్‌లో ప్రైమరీ సెర్చ్, డేటా కలెక్షన్, బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్స్, కాంటెక్స్ట్ వంటి వాటితో పాటు మరిన్ని ఉంటాయి.
గ్రోక్ 3 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్: ఎక్స్ ప్రీమియం ప్లస్ వినియోగదారులకు ఈ 'గ్రోక్ 3' సేవలు ముందుగా అందుబాటులోకి వస్తాయి. అంటే 'గ్రోక్ 3'ని ముందస్తుగా యాక్సెస్ చేయాలంటే ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని ధర ప్రస్తుతం భారత్‌లో నెలకు రూ.1750గా ఉంది. అలాగే రీజనింగ్, డీప్ సెర్చ్ క్వెరీస్, అన్లిమిటెడ్ ఇమేజ్ జనరేషన్ వంటి అధునాతన సామర్థ్యాలు, కొత్త ఫీచర్లు కోరుకొనే వారికోసం 'సూపర్‌గ్రోక్' పేరుతో ఓ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌నూ తీసుకొచ్చారు. ఈ ప్లాన్లను గ్రోక్ మొబైల్ యాప్, Grok.com వెబ్‌సైట్ యూజర్లు పొందొచ్చు. అయితే 'ఎక్స్' యూజర్లందరికీ దీన్ని ఉచితంగా తెస్తారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్‌రేట్‌తో రియల్మీ P3 సిరీస్- రూ. 13,999లకే!
'లో కాస్ట్' విత్ 'నో కోడ్'- జొమాటో నుంచి కస్టమర్ సపోర్ట్ AI ప్లాట్‌ఫామ్!
సముద్ర గర్భంలోకి మనుషులు- 6వేల మీటర్ల లోతులో పరిశోధన- 'మత్స్య-6000' టెస్ట్ సక్సెస్