ETV Bharat / state

వారంతా ఎవరు? ఎక్కడి వారు - ఆ 'మృత్యు'ఘోష మన 'గాంధీ'కే ఎరుక! - UNIDENTIFIED DEATHS IN HYDERABAD

గాంధీ ఆసుపత్రి పరిసరాల్లో గుర్తు తెలియని మృతదేహాలు - నిత్యం ఒకరు చొప్పున మృతి - 11 నెలల్లో 100 మంది మృతి

Human Story
Human Story (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2024, 11:07 AM IST

Human Story : నిత్యం రోడ్లపై అనాథల్లా కనిపిస్తూ, యాచకం చేస్తూ వందలాది మంది కనిపిస్తారు. వారంతా ఎవరో? ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియడం లేదు. కానీ వారంతా గాంధీ ఆసుపత్రి, పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఆవాసం పొందుతున్నారు. చివరికి అక్కడే అసువులు బాస్తూ, గుర్తు తెలియని మృతదేహాల జాబితాలో చేరుతున్నారు. 11 నెలల్లో 100 మంది దాకా మృతి చెందారు. ఇప్పుడు ఈ మరణాలు అటు ఆసుపత్రుల వారికి, ఇటు పోలీసులకు తలనొప్పిగా మారాయి. గాంధీ ఆసుపత్రి ఆవరణతో పాటు, గాంధీ మెట్రో స్టేషన్​ వద్ద తరచూ యాచకుల మృతదేహాలు నిత్యం బయటపడుతున్నాయి.

ఆవాసం, ఆహారం లభిస్తుందని : ముఖ్యంగా గాంధీ ఆసుపత్రి ఎదుట నిత్యం అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి. దీంతో గాంధీ ఆసుపత్రి వద్ద ఉంటే నిత్యం తినడానికి ఏదో ఒకటి దొరుకుతుందని యాచకులు అక్కడే ఎక్కువగా ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. గాంధీ మెట్రో స్టేషన్ కింద విశాలంగా ఉన్న రోడ్డు డివైడర్లపై ఉంటూ, దాతలు ఇచ్చింది తింటూ కాలం గడిపేస్తున్నారు.

వారికి సుస్తి చేసి అనారోగ్యం బారిన పడితే మాత్రం ఎలాంటి చికిత్స దొరక్క గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని మృతదేహాల్లా పడి ఉంటున్నారు. ఇది అక్కడ సర్వ సాధారణమయిపోయింది. కొంతకాలంగా ప్రతిరోజు ఒక్కరు చొప్పున చనిపోతూనే ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 100 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ అనుదీప్‌ వెల్లడించారు.

గతంలో నైట్​హోం షెల్టర్లు : గతంలో వృద్ధులు సేద తీరేందుకు నైట్​హోం షెల్టర్లు ఉండేవి. ఉదయం అంతా ఎక్కడెక్కడో గడిపినా రాత్రి కాగానే అక్కడికి చేరుకునేవారు. ఇప్పుడు నిర్వహణ కొరవడడంతో పాటు రాత్రివేళ వచ్చే వారి సంఖ్య తగ్గడంతో క్రమంగా వాటిని మూసేశారు. ఇప్పుడు అలాంటి నైట్​హోం షెల్టర్లు గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉండి ఉంటే ఇప్పుడిలా ప్రతిరోజు ఒకరు చెప్పున మరణించి, గుర్తు తెలియని శవాలుగా మిగిలిపోయేవారు కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అయినవాళ్లే వదిలేసుకుంటున్నారా? : అనాథ చావుల వెనక మరో కోణం దాగి ఉందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. దశాబ్దం కిందట ఓ వ్యక్తి వాహనంలో వృద్ధుడిని తీసుకువచ్చి తెల్లవారుజామున రోడ్డుపక్కన వదిలేసిన ఘటనను చూసి కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇలా తీసుకొచ్చి వదిలేస్తున్నారనే ఆరోపణలు కాదనలేనివి. వయసు పైబడి, అనారోగ్యంతో ఉన్న వారిని వదిలించుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఇలా తీసుకొచ్చి గాంధీ ఆసుపత్రి ఆవరణలో వదిలేసి వెళ్లపోతున్నారనే అనుమానులూ వస్తున్నాయి.

షాద్​నగర్​లో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య - మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్​లో చుట్టి!

గర్భిణీ దారుణ హత్య- 20ముక్కలు చేసి రోడ్డు పక్కన వేసిన దుండగులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.