ETV Bharat / spiritual

నవంబర్​ 29 కార్తిక మాస శివరాత్రి - ఆ రోజు ఇవి పాటిస్తే శివుడి అనుగ్రహం మీపైనే! - KARTHIKA MASA SHIVARATRI REMEDIES

-వేల రెట్లు మహిమాన్వితమైన కార్తిక మాస శివరాత్రి -ఈ రోజున పాటించే పరిహారాలతో సంపూర్ణ శివానుగ్రహం

Karthika Masa Shivaratri Remedies
Karthika Masa Shivaratri Remedies (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 12:01 PM IST

Karthika Masa Shivaratri Remedies: ప్రతినెలా అమావాస్యకు ముందు రోజు వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు. హిందూ మతంలో మాస శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పరమశివుడిని పూజిస్తే కోరిన కోరికలు నేరవేరతాయని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది మాస శివరాత్రిని నవంబర్ 29వ తేదీన జరుపుకోనున్నారు. అయితే.. ఏడాదంతా శివుని అనుగ్రహం లభించాలంటే మాసశివరాత్రి రోజు కొన్ని ప్రత్యేకమై విధివిధానాలు పాటించాలని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

సాధారణ మాస శివరాత్రి కన్నా కార్తికమాసంలో వచ్చే మాస శివరాత్రి కొన్ని వేల రెట్లు మహిమాన్వితమైనదని చెబుతున్నారు మాచిరాజు. ఆ రోజున పాటించాల్సిన విధులేంటంటే..

నక్త వ్రతం: కార్తిక మాస శివరాత్రి రోజున నక్తవ్రతం చేయాలని చెబుతున్నారు. అంటే ఉదయం శివపూజ చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలం సమయంలో ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం లేదా పూజ చేసి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి నక్షత్ర దర్శనం చేసుకుని ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా చేస్తే పరమశివుని అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు.

అభిషేకాలు: ఈ మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేసినా మంచిదని చెబుతున్నారు మాచిరాజు. దర్బలు కలిపిన నీటితో అభిషేకం చేయాలని, అలాగే పంచామృతాలు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, విభూది జలాలతో అభిషేకం చేసినా మంచిదని చెబుతున్నారు. అయితే..

  • శత్రుబాధలు తొలగిపోవాలనుకున్న వారు మాస శివరాత్రి రోజున ఖర్జూర పండ్ల రసంతో శివలింగానికి అభిషేకం చేయాలని సూచిస్తున్నారు.
  • పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలంటే ద్రాక్షపండ్ల రసంతో శివాభిషేకం నిర్వహించాలని చెబుతున్నారు.
  • జాతకంలో నవగ్రహాలు అనుకూలించాలంటే బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేయాలి. మనశ్శాంతి కోసం వెన్నతో అభిషేకించాలని సూచిస్తున్నారు.
  • మహిళలకు దీర్ఘసుమంగళి యోగం కలగాలంటే మాస శివరాత్రి రోజు శివలింగం మీద రాళ్ల ఉప్పు ఉంచి నమస్కారం చేయాలని చెబుతున్నారు.

పూజించాల్సిన పుష్పాలు: కార్తిక మాస శివరాత్రి రోజుల పరమేశ్వరుడిని జిల్లేడు పూలతో పూజించాలని చెబుతున్నారు. అలాగే ప్రాచీన శివాలయాల్లో లభించే నాగశివలింగ పుష్పాన్ని(సహస్ర ఫణి పువ్వు) శివుడి దగ్గర ఉంచమని చెబుతున్నారు. ఒకవేళ సహస్ర ఫణి పువ్వు దొరకకపోతే జిల్లేడు పూలు, ఎర్ర మందారాలతో పూజించమని సూచిస్తున్నారు.

నైవేద్యాలు: కార్తిక మాస శివరాత్రి రోజన ఆ పరమేశ్వరుడికి కొబ్బరి ముక్కలు, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెట్టాలని వివరిస్తున్నారు. అలాగే శివుడికి పంచ సౌగంధికాలను తాంబూలంగా సమర్పించాలని చెబుతున్నారు. అంటే తమలపాకులో వక్కలు ఉంచి జాజికాయ, జాపత్రి,యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు ఉంచి తాంబూలం సమర్పించాలి. ఆ తర్వాత దానిని స్వీకరించాలి. అలాగే దవన పుష్ప మాలను కూడా వేయాలని చెబుతున్నారు.

చదవాల్సిన మంత్రాలు: ఆర్థికంగా పురోగతి లభించాలంటే కార్తిక మాస శివరాత్రి రోజులు కచ్చితంగా రెండు మంత్రాలు చదవాలని చెబుతున్నారు. అవేంటంటే..

  • మొదటి మంత్రం.. "శ్రీ శివాయ.. మహాదేవాయ.. ఐశ్వర్యేశ్వరాయ నమః"
  • రెండో మంత్రం.."శ్రీం శివాయ నమః "
  • గ్రహ, నక్షత్ర దోషాలు పోవాలంటే "ఓం నమో భగవతే రుద్రాయ" మంత్రాన్ని చదువుకుంటూ అభిషేకం చేయాలని చెబుతున్నారు. అలాగే మాస శివరాత్రి రోజున సాయంత్రం శివాలయంలో శివుడికి సమర్పించే నందిహారతి, నాగ హారతి దర్శించుకోవాలని చెబుతున్నారు. అలాగే చండీ ప్రదక్షిణ కూడా చేయాలని వివరిస్తున్నారు.
  • కుటుంబంలో మనశ్సాంతి లభించాలన్నా, కలహాలు తొలగిపోవాలన్నా మాస శివరాత్రి రోజున సాయంత్రం పూట కొబ్బరినూనె దీపం వెలిగించాలని సూచిస్తున్నారు. దీపదానం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయని అంటున్నారు.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

అమావాస్య ముందు ఆరోగ్య సమస్యలా? ఈ 'స్పెషల్​' సోమవారం పూజతో అంతా సెట్​!

ప్రమోషన్ కోసం అలా, వివాహం కోసం ఇలా! కార్తీక మాసంలో ఎవరేం చేయాలంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.