ETV Bharat / entertainment

రియల్​ లైఫ్​ స్టోరీలతో హిట్​ కొట్టిన టాప్-5 మూవీస్ ఇవే - అస్సలు మిస్​ కావద్దు సుమా!

యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కి, బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురింపించిన టాప్ 5 సినిమాలివే! అస్సలు మిస్​ కావద్దు సుమా!

Top 5 Real Life Story Blockbuster Movies
Top 5 Real Life Story Blockbuster Movies (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Top 5 Real Life Story Blockbuster Movies : ఇటీవల కాలంలో యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్లు కొడుతున్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన 'లక్కీ భాస్కర్' సహా 'ది సబర్మతి రిపోర్టు' వంటి సినిమాలు నిజ జీవిత ఘటనల ఆధారంగానే తెరకెక్కి మంచి సక్సెస్​ను అందుకున్నాయి. ఈ క్రమంలో రియల్​ లైఫ్​ స్టోరీల ఆధారంగా రూపొంది భారీ హిట్ కొట్టిన టాప్-5 మూవీస్​పై ఓ లుక్కేద్దాం.

1. కేదార్ నాథ్(2018)
బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ కెరీర్​లో హిట్‌గా నిలిచిన చిత్రం 'కేదార్‌నాథ్‌'. ప్రకృతి వైపరీత్యాల వల్ల 2013 జూన్​లో ఉత్తరాఖండ్​లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీని ఆధారంగా దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ 'కేదార్‌నాథ్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. కథానాయికగా సారా అలీ ఖాన్‌ నటించారు. ఎమోషనల్, రొమాంటిక్ డ్రామాగా కేదార్ నాథ్ చిత్రాన్ని దర్శకుడు రూపొందించారు. సారా అలీఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్‌ వేర్వేరు మతాలను చెందిన వ్యక్తులుగా ఇందులో నటించారు. నిజ జీవిత సంఘటనలు, మానవత్వం, ప్రేమ గురించి ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందించిందీ చిత్రం. అలాగే మతాలు, వారి విశ్వాసాలు గురించి దర్శకుడు చక్కగా కేథార్ నాథ్​లో చూపించారు.

2. ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ (2019)
విక్కీ కౌశల్‌ హీరోగా ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్​టైనర్‌ ఉరి : ది సర్జికల్ స్ట్రైక్. 2016 నాటి ఉరి ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్​లోని ముష్కర మూకలపై భారత ప్రభుత్వం పారా స్పెషల్‌ ఫోర్సెస్​తో మెరుపు దాడులు చేసింది. ఈ సర్జికల్‌ స్ట్రైక్‌ ఆపరేషన్‌ స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించిన చిత్రమే 'ఉరి'. విక్కీ కౌశల్ మేజర్ విహాన్ షెర్గిల్​గా కనిపించారు. సాయుధ దళాల ధైర్యాన్ని, క్రమశిక్షణను ఉరిలో చక్కగా చూపించారు దర్శకుడు ఆదిత్య ధర్‌. 2019 జనవరిలో విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్లు సాధించింది.

3. ది కశ్మీర్‌ ఫైల్స్‌(2022)
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొంది, దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమా 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'. ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి దీన్ని తెరకెక్కించారు. 90వ దశకంలో కశ్మీర్‌ పండిట్​లపై జరిగిన దారుణ మారణకాండకు దృశ్య రూపమే ఈ చిత్రం. 1990లో కశ్మీర్‌ హిందూ పండిట్​లపై తీవ్రవాదులు, వేర్పాటువాదులు దాడులు చేశారు. వేల మంది పండిట్​లను ఊచకోత కోయడమే కాక వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో అనేక మంది పండిట్​లు ప్రాణ భయంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 32ఏళ్ల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనలను 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'లో ఎంతో భావోద్వేగభరితంగా కళ్లకు కట్టినట్లు చూపించారు వివేక్‌ అగ్నిహోత్రి. 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమాలో అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ హిట్ కొట్టింది. అలాగే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

4. ది సబర్మతి రిపోర్ట్‌(2024)
2002లో గుజరాత్‌ లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహన కాండ ఆధారంగా తెరకెక్కిన మూవీ 'ది సబర్మతి రిపోర్ట్‌'. ఈ మూవీని బాలీవుడ్‌ దర్శకుడు ధీరజ్ సర్నా తెరకెక్కించారు. ఇందులో విక్రాంత్‌ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను అలరించింది.

5. లక్కీ బాస్కర్(2024)
1980లో ముంబయి బ్యాక్ డ్రాప్ లో జరిగిన కథగా 'లక్కీ భాస్కర్' ను తెరకెక్కించారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. మనీలాండరింగ్, బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్లు, మధ్యతరగతి కుటుంబం మనస్తత్వాలు నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించి సక్సెస్ కొట్టారు. మధ్య తరగతి బ్యాంకు ఉద్యోగిగా దుల్కర్ కనిపించారు. అలాగే హీరోయిన్​గా మీనాక్షి చౌదరి నటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.