Nellore Special Jom Pachadi :వంటింట్లో ఏ కూర వండాలన్నా నూనె, తాలింపు గింజలు తప్పకుండా ఉండాల్సిందే. ఇక పచ్చడి కోసం అయితే నూనె, తాలింపు గింజలు కాస్తంత ఎక్కువగానే వాడుతుంటాం. ఇవి లేకుంటే దాదాపు కిచెన్లో ఏ రెసిపీ తయారీ పూర్తి కాదు. అయితే, ఇవేవి లేకుండానే నోరూరించే పచ్చడి తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా ? అవునండీ.. చుక్క నూనె వాడకుండానే తయారు చేసే ఒక పచ్చడిని ఇప్పుడు చూద్దాం.
ఆయిల్ లేకుండా తయారు చేసే టేస్టీ అండ్ హెల్దీ చట్నీ.. "నెల్లూరు స్పెషల్ జోం పచ్చడి". జోం పచ్చడి ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే కారంగా, పుల్లపుల్లగా ఎంతో రుచికరంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని పచ్చడితోతింటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ పచ్చడిని చపాతీలు, పుల్కాల్లో కూడా తినవచ్చు. బరువు తగ్గాలని నూనె తక్కువగా యూజ్ చేసేవారు ఈ పచ్చడిని ఓ సారి ట్రై చేయండి. మరి ఇక ఆలస్యం చేయకుండా కమ్మని జోం పచ్చడి ఎలా చేయాలో మీరు ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- పచ్చిమిర్చి-15
- చింతపండు-నిమ్మకాయ సైజంత
- బెండకాయ-4
- టమాటాలు-3
- వెల్లుల్లి రెబ్బలు-2
- ఉప్పు రుచికి సరిపడా
- నీళ్లు -గ్లాసు