Telangana Model School Application Open : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తుండటంతో ప్రతి సంవత్సరం వీటిలో ప్రవేశాలకు పోటీ అధికంగానే ఉంటుంది. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 6 నుంచి 10 వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యా బోధన అందుతుండటం, బాలికలకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తుండటంతో విద్యార్థులను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 28 వరకు గడువు ఉంది.
ఆయా పాఠశాలలో ఖాళీలను ప్రవేశ పరీక్ష : ప్రవేశ పరీక్ష ద్వారా ఆరో తరగతిలో చేర్చుకుంటారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్మీడియట్ విద్యలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆరో తరగతిలో కొన్ని సీట్లకు ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. 7 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఆయా పాఠశాలలో ఖాళీలను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు.
విభిన్న అంశాల్లో రాణింపు : చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విజ్ఞాన మేళాలు, పోటీ పరీక్షల్లో రాణించేందుకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ ఉపకార వేతనాలకు ఈ స్కూల్లో చదివే విద్యార్థులే ఎక్కువగా ఎంపిక అవుతున్నారు. పదో తరగతిలో మెరుగైన మార్కులు సాధిస్తూ బాసర ఐఐఐటీలో సీట్లు పొందుతున్నారు. మైక్రో ఇరిగేషన్, యానిమేషన్, బ్యాంకింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంసెట్, నీట్ స్వయం ఉపాధి కోసం ఒకేషనల్ కోర్సుల్లోనూ శిక్షణను ఇస్తున్నారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని బంగారు పతకాలు సైతం సాధిస్తున్నారు.
పేద విద్యార్థులకు ఈ అవకాశం వరం : రాజు, కామారెడ్డి జిల్లా డీఈవో రాజు మాట్లాడుతూ, పేద విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు వరంగా మారాయని అన్నారు. మెరుగైన సౌకర్యాలతో నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ ఎప్సెట్ నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ
బీటెక్ విద్యార్థులకు అలర్ట్ - ఇక నుంచి ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్లు తప్పనిసరి!