Ind vs Pak 2025 : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. హిట్‌మ్యాన్ వన్డేల్లో ఓపెనర్‌గా 9 వేల పరుగులు పూర్తి చేశాడు. 181 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయి అందుకొని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఓపెనర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 1 పరుగు వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ (197 ఇన్నింగ్స్) రికార్డ్ బ్రేక్ చేశాడు.
వన్డేల్లో 9000 పరుగులు పూర్తి చేసిన ఓపెనర్లు
- రోహిత్ శర్మ- (181 ఇన్నింగ్స్)- 9001* పరుగులు
- సచిన్ తెందూల్కర్ - (197 ఇన్నింగ్స్)- 15310 పరుగులు
- సౌరభ్ గంగూలీ - (231 ఇన్నింగ్స్) -9146 పరుగులు
- క్రిస్ గేల్ - (246 ఇన్నింగ్స్)-10179 పరుగులు
- ఆడమ్ గిల్‌క్రిస్ట్ - (253 ఇన్నింగ్స్)-9200 పరుగులు
- సనత్ జయసూర్య - (268 ఇన్నింగ్స్)- 12740 పరుగులు
కాగా, రీసెంట్గా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఓవరాల్‌గా రోహిత్ ఇప్పటివరకు 262 ఇన్నింగ్స్‌లో 11049 పరుగులు చేశాడు. అందులో 32 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
విరాట్ అరుదైన రికార్డ్
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం ఈ మ్యాచ్‌లో అరుదైన రికార్డ్ కొట్టాడు. వన్డేల్లో టీమ్ఇండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా రికార్డ్ సాధించాడు. విరాట్ ఇప్పటివరకు వన్డేల్లో 157 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దిన్ (156 క్యాచ్‌లు) ను అధిగమించాడు. ఓవరాల్‌గా విరాట్ ఈ లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. వరల్డ్‌వైడ్‌గా శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే (218 క్యాచ్‌లు) టాప్‌లో ఉండగా, ఆసీస్ మాజీ రికీ పాంటింగ్ (160 క్యాచ్‌లు) రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
Safe hands 🔝
— BCCI (@BCCI) February 23, 2025
Virat Kohli now holds the record for taking the most catches as a fielder in ODIs for #TeamIndia 🙌
Live ▶️ https://t.co/llR6bWyvZN#PAKvIND | #ChampionsTrophy | @imVkohli pic.twitter.com/ZAxFmIFCnB
భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్
- విరాట్ కోహ్లీ - 157 క్యాచ్‌లు
- మహ్మద్ అజారుద్దిన్ - 156 క్యాచ్‌లు
- సచిన్ తెందూల్కర్ - 140 క్యాచ్‌లు
- రాహుల్ ద్రవిడ్ - 124 క్యాచ్‌లు
- సురేశ్ రైనా - 102 క్యాచ్‌లు
రఫ్పాడించిన భారత బౌలర్లు- పాక్ 241 ఆలౌట్
ఎల్లో జెర్సీలో లైవ్ మ్యాచ్ చూస్తున్న ధోనీ- షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ!