Tips to Avoid Hangover in Telugu : ప్రస్తుత రోజుల్లో మందు తాగడం అనేది కామన్ అయ్యింది. పార్టీలు, ఫంక్షన్లప్పుడు ఫుల్లుగా డ్రింక్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే సంతోషంలో డిసెంబర్ 31 ఎక్కువమంది చిల్ అవుతుంటారు. రాత్రంతా తాగినప్పుడు ఏం అనిపించదు. కానీ, ఆ తెల్లారి (జనవరి 1) మొదలవుతుంది అసలు సినిమా. హ్యాంగోవర్ కారణంగా ఉదయం లేచీ లేవగానే తలంతా ఒకటే నొప్పిగా, నీళ్లు తాగినా దాహంగా అనిపించడం, కనీసం ఫోన్ కూడా చూడలేకుండా కళ్లు నొప్పిగా ఉంటాయి. అసలు హ్యాంగోవర్‌కు మద్యం సేవించడం ఒక్కటే కారణమా? ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఏ ఆహారం తినాలి ? అనే ప్రశ్నలకు నిపుణుల సమధానాలేంటో ఇప్పుడు చూద్దాం.
హ్యంగోవర్ ఎందుకు వస్తుంది?: డీ హైడ్రేషన్ కారణంగా హ్యంగోవర్ ఇబ్బంది పెడుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మన బాడీలోకి చేరిన మద్యం మూత్రం రూపంలో బయటకు వెళ్తుంది. దీనివల్ల బాడీలో వాటర్ శాతం బాగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మనం ఎంత ఎక్కువగా తాగితే అంతగా వాటర్ బయటకు వెళ్లిపోతుందట! అయితే, మనం తాగిన మద్యం రక్తంలో కలిసిపోతుంది. ఫలితంగా బ్లడ్‌లో షుగర్ స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోయి అసమతుల్యత లోపిస్తుంది. ఇక బ్రాందీ, స్కాచ్, విస్కీ వంటి వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కోసం.. అలాగే రుచి వాసన పెంచడం కోసం కంజెనర్స్ కొన్ని రకాల కెమికల్స్ కలుపుతారు. వీటివల్ల మనకు హ్యాంగోవర్ సమస్య ఇబ్బంది పెడుతుంది. అయితే, వీటితో పోలిస్తే వోడ్కా, రమ్, జిన్ లాంటి మద్యంలో కంజెనర్స్ శాతం తక్కువగా ఉంటుంది. ఇక ఒకే రకమైన మందు కాకుండా రెండు, మూడు కలిపి చేసే కాక్‌టైయిల్స్ షాట్స్ హ్యాంగోవర్‌ను మరింత పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ చిట్కాలతో హ్యాంగోవర్ దూరం:
- హ్యాంగోవర్ తగ్గడానికి మంచినీటిని ఎక్కువగా తాగాలని చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుందని.. ఈజీగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చంటున్నారు.
- ఈ చలికాలంలో ఎక్కువ మంది చల్లటి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడరు. కానీ, రాత్రంతా ఫుల్లుగా మందు తాగిన వారు ఉదయాన్నే చల్లటి నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల బాడీలో రక్తప్రసరణ మెరుగవుతుంది. దీంతో హ్యాంగోవర్‌కి చెక్ పెట్టచ్చు.
- ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉన్న డ్రింక్స్ తీసుకుంటే శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను భర్తీ చేయవచ్చని.. ఇందుకోసం స్పోర్ట్స్ డ్రింక్స్, కొబ్బరినీరు, గ్లూకోజ్ వాటర్ వంటివి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
- అరటిపండ్లు, అవకాడో, యోగర్ట్ లాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా హ్యాంగోవర్, తలనొప్పి, అలసట సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు. వీటిల్లో అధిక మోతాదులో ఉండే పొటాషియం, సోడియం పోషకాలు మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేస్తాయని సూచిస్తున్నారు.
'న్యూ ఇయర్' వేళ - బిర్యానీ కోసం అర కిలోమీటరు 'క్యూ లైన్'
న్యూఇయర్ విషెస్ అంటూ లింక్స్ వస్తున్నాయా? - ఇప్పుడు ఇదే సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్