Royal Enfield Flying Flea C6: రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అయిన 'ఫ్లయింగ్ ఫ్లీ C6'ను ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెకండ్ వరల్డ్ వార్‌లో బ్రిటిష్ సైన్యంలో ఉపయోగించిన ఒరిజినల్ ఫ్లయింగ్ ఫ్లీ నుంచి తీసుకొచ్చారు. EICMA షో అధికారికంగా ప్రారంభమయ్యే ఒక రోజు ముందు మిలన్‌లో జరిగిన ఇన్వైట్-ఓన్లీ ఈవెంట్ 'ఆఫీస్ డెల్ వోలో'లో ఈ ఫ్లయింగ్ ఫ్లీ C6ను మొదటిసారి ప్రదర్శించారు.
దీనిలో ప్రత్యేకత ఏంటంటే.. ఈ బైక్‌తో పాటు కంపెనీ ఆల్-ఎలక్ట్రిక్ సబ్-బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీని కూడా భారతదేశంలో ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈ ఫస్ట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లాంఛ్ గురించి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. భారత్, UK నుంచి 200 మందికి పైగా ఇంజనీర్లు ఈ మోటార్ సైకిల్ అభివృద్ధిలో పాలుపంచుకున్నారని చెన్నైకి చెందిన ఈ టూ-వీలర్ తయారీ సంస్థ తెలిపింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 డిజైన్: ఈ C6 ఆధునిక సాంకేతికతతో కూడిన వింటేజ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌ను పూర్తిగా కొత్త అల్యూమినియం కేజ్ ఫ్రేమ్ నిర్మించడం వల్ల ఇది లైట్‌వెయిట్‌లో వస్తుంది. C6 మెయిన్ డిజైన్ హైలైట్ ఏంటంటే గిర్డర్ ఫ్రంట్ ఫోర్క్‌ల వినియోగం. దీంతో ఈ అధునాతన సస్పెన్షన్ వ్యవస్థను కలిగి ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా ఇది నిలిచింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మెయిన్ VCU (వెహికల్ కంట్రోల్ యూనిట్) రైడర్ మోటార్‌సైకిల్‌లోని అన్ని ఫిజికల్ అండ్ డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లను ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా ఈ మోటార్‌సైకిల్ కంట్రోల్స్ మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఫీచర్లు: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడించలేదు. అయితే బ్యాటరీని మెగ్నీషియం కేసింగ్ లోపల ఉంచుతామని కంపెనీ కన్ఫార్మ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బెల్ట్-డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అదనంగా C6 ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ABS వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి.
అంతేకాకుండా C6 స్టాండర్డ్ త్రీ-పిన్ ప్లగ్ ద్వారా ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, టెయిల్‌లైట్లు, డిజిటల్ డిస్‌ప్లే కోసం LED హౌసింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫ్లయింగ్ ఫ్లీ ఐదు రైడ్ మోడ్‌లతో వస్తుంది. రైడర్లు వారి ప్రాధాన్యత, స్పెసిఫిక్ నీడ్స్‌కు అనుగుణంగా ఒక్కో మోడ్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రైడర్ స్మార్ట్‌ఫోన్‌తో ఈ టూ-వీలర్ ఆన్, ఆఫ్ చేసేందుకు స్మార్ట్ కీని ఉపయోగించొచ్చు.
'రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6' కనెక్టెడ్ టెక్: ఫ్లయింగ్ ఫ్లీలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ QWM2290 చిప్‌సెట్ అమర్చినట్లు కంపెనీ నివేదించింది. ఇది నిజమే కావచ్చు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 2025 CES (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో)లో ప్రదర్శించినప్పుడు ఇది రియల్ టైమ్ కనెక్టివిటీ కోసం క్వాల్‌కామ్ సహకారంతో పనిచేసింది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీని స్నాప్‌డ్రాగన్ కార్-టు-క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కనెక్ట్ చేసే టెక్నాలజీని ఉపయోగించే వినూత్న వాహనాలలో ఒకటిగా చేస్తుంది.
వారెవ్వా! మైక్రోసాఫ్ట్ 'మయోరానా' వేరీ పవర్ఫుల్ బాస్- దశాబ్దాల సమస్యకు కూడా ఇట్టే చెక్!
స్టైలిష్ లుక్‌లో 'జావా 350 లెగసీ ఎడిషన్' లాంఛ్- మొదటి 500 కస్టమర్లకు భారీ డిస్కౌంట్!
ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్- ఇకపై కంటెంట్ క్రియేటర్లపై కాసుల వర్షమే..!