Your Phone is Real or Fake : ఫోన్ కొనుగోలు చేసేవారు బ్రాండ్ చూస్తారు. స్పెసిఫికేషన్స్ చూస్తారు. ఇంకా లుక్ చూస్తారు. ఫైనల్ గా ధర కూడా చూస్తారు. కానీ, ఆ ఫోన్ నిజమైనదా? డూప్లికేటా? అన్నది మాత్రం చూడరు. అసలు అది ఎలా చూడాలో తెలియదు. మరి, మీకు తెలుసా? ఇంతకీ ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఫోన్ ఒరిజినలా? ఫేకా? ఇలా తెలుసుకోండి.
మోసపూరిత కాల్స్/ సందేశాలకు చెక్ పెట్టడం, మనం ఉపయోగించే ఫోన్ నిజమైనదేనా? అని తెలుసుకునేందుకు టెలికాం శాఖ సంచార్ సాథీ (Sanchar Saathi) అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2023లో సంచార్ సాథీ పోర్టల్‌ను కేంద్ర టెలికాం శాఖ అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ యాప్‌ను లాంచ్ చేయడం ద్వారా మరింత సమర్థంగా మోసాలకు చెక్ పెట్టొచ్చని భావించిన కేంద్రం ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఈ యాప్ వినియోగించొచ్చు. మరి, ఫోన్ ఒరిజినలా? or డూప్లికేటా? అని ఎలా ఇప్పుడు చూద్దాం.
- ముందుగా ఫోన్ లో ప్లే స్టోర్ నుంచి సంచార్ సాథీ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ పేరుతో రిజిస్టర్ అవ్వాలి.
- ఆ తర్వాత Citizen Centric Servicesలో Know Genuineness of Your Mobile Handset ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీ ఫోన్ 15 డిజిట్స్ IMEI నెంబర్ ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత Submit ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ ఫోన్ IMEI కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
- అందులో స్టేటస్, IMEI నెంబర్, ఫోన్ బ్రాండ్ నేమ్, మోడల్ నేమ్, ఎవరు తయారు చేశారు, డివైజ్ టైప్ వంటి వివరాలు కనిపిస్తాయి.
- అందులో స్టేటస్ లో మీ IMEI నెంబర్ Valid అని వస్తే మీ ఫోన్ రియల్ అన్నట్లు. పైన చెప్పిన వివరాలు అన్నీ కనిపిస్తాయి.
- అదే IMEI Invalid అని వస్తే అది డూప్లికేట్ ఫోన్ గా గుర్తించాలి.
IMEI నెంబర్ ఎలా తెలుసుకోవాలి? :
- మీ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ను గుర్తించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.
- మీ ఫోన్ బాక్స్ మీద IMEI నెంబర్లు ఉంటాయి. వాటి ద్వారా సెర్చ్ చేయవచ్చు.
- లేదా మీ ఫోన్ లో డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి*#06# ఎంటర్ చేస్తే మీ IMEI నెంబర్ డిస్ ప్లే అవుతుంది.
- లేదా మీ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో About Phone పై క్లిక్ చేస్తే ఫోన్ కు సంబంధించిన వివరాలు డిస్ ప్లే అవుతాయి.
- అందులోని IMEI నెంబర్ ను నోట్ చేసుకుని సెర్చ్ చేస్తే సరి.
ఇవి కూడా చదవండి :
అదిరే ఫీచర్లతో ఐఫోన్ 16ఈ రిలీజ్ - భారత్‌లో ధర ఎంతో తెలుసా?
రూ.10 వేలలోపు 5G ఫోన్ కొనాలనుకుంటున్నారా? - ఈ సామ్సంగ్ మొబైల్‌పై ఓ లుక్కేయండి