Shirdi Sai Sansthan Operations in Paperless: కీలక నిర్ణయం తీసుకున్న షిర్డీ సాయి సంస్థాన్ .. కార్యకలాపాలన్నీ కాగిత రహితం - shirdi saibaba sansthan e office system
🎬 Watch Now: Feature Video
Published : Aug 26, 2023, 2:42 PM IST
Shirdi Sai Sansthan Operations in Paperless: దేశంలోనే ఎంతో పేరున్న షిర్డీ సాయి సంస్థాన్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా.. సాయి సంస్థాన్ పరిపాలన మొత్తం కాగిత రహితంగా మార్చాలని నిర్ణయించింది. షిర్డీలోని సాయిబాబా సంస్థాన్ పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు గాను కాగితరహితంగా మార్చారు. ఇటీవలే సాయి సంస్థాన్ ఇ-ఆఫీస్ వ్యవస్థను ప్రారంభించింది. ఇందులో భాగంగా పరిపాలనా వ్యవహారాలు అన్నీ ఇకనుంచి పేపర్‌లెస్‌గా ఉండనున్నాయి. దేశంలోనే ఎంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీ సాయి సంస్థానానికి ప్రతి ఏడాది మూడు కోట్లకు పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. అంతే కాకుండా సాయి సంస్థాన్ కార్యకలాపాల నిర్వహణ కూడా చాలా పెద్దది. ఇది హైకోర్టు పర్యవేక్షణలో ప్రధాన న్యాయమూర్తితో కూడిన తాత్కాలిక కమిటీని కలిగి ఉంది. వీటన్నింటినీ చూసేందుకు ఐఏఎస్ ర్యాంక్ అధికారిని నియమించారు. మొత్తం 44 విభాగాల నుంచి అనేక ఫైళ్లు కార్యాలయంలో ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ పేపర్ లెస్‌గా మారనున్నాయి. సాయి సంస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా పెద్ద సంఖ్యలో చెట్లు రక్షించబడతాయి.