బాటిల్లోని మందు తాగేందుకు ఏనుగు పిల్ల యత్నం! వీడియో వైరల్ - BABY ELEPHANT VIRAL VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Jan 22, 2025, 9:57 AM IST
Baby Elephant Viral Video : తమిళనాడు నీలగిరి జిల్లాలోని ముదుమలై అడవిలో ఓ ఏనుగు పిల్ల వైన్ బాటిల్లోని మద్యాన్ని తాగేందుకు యత్నించింది! తన తొండంతో చెత్తలో పేరుకుపోయిన వైన్ బాటిల్‌ను బయటకు తీసింది. అందులో ఉన్న వైన్‌ను తాగేందుకు యత్నించగా, ఆ సమయంలో అక్కడ ఉన్న పర్యటకులు ఆ దృశ్యాలను వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముదుమలై అడవిలో పెద్ద సంఖ్యలో ఏనుగులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, జింకలు నివసిస్తున్నాయి. ఆ జంతువులను చూసేందుకు రోజూ వేలాది మంది పర్యటకులు ముదుమలైకి వస్తుంటారు. ఈ క్రమంలో టూరిస్టులు నిషేధిత ప్లాస్టిక్, మద్యం బాటిళ్లను అటవీ ప్రాంతాల్లో విసురుతుండటం వల్ల వాటిని తిని వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు, బాటిళ్లను తొలగించాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో పర్యటకులు విసిరే ప్లాస్టిక్, మద్యం బాటిళ్లను పూర్తిగా తొలగించేలా అటవీశాఖ చర్యలు తీసుకోవాలని, గస్తీ నిర్వహించాలని కోరుతున్నారు.