Smriti Mandhana BCCI Award : బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముంబయిలో శనివారం జరిగిన ఈ ఈవెంట్‌కు దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్ సహా టీమ్ఇండియా ప్లేయర్లు హాజరయ్యారు. కాగా, ఈవెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు హార్దిక్ పాండ్య, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో స్మృతి మంధానను హార్దిక్ ఆసక్తికర ప్రశ్న అడిగాడు.
డ్రెస్సింగ్ రూమ్‌లో మ్యూజిక్ ప్లే లిస్ట్ క్రియేట్ చేయాలంటే తాను ఎంచుకునే టాప్ 3 పాటలు ఏంటని హార్దిక్ అడిగాడు. దీనికి స్మృతి ఇంట్రెస్టింగ్గా సమాధానమిచ్చింది. తాను ఎక్కువగా లవ్ అండ్ సాడ్ (Love And Sad Songs) సాంగ్స్ వింటానని బదులిచ్చింది. 'నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. కానీ, డ్రెస్సింగ్ రూమ్‌లో మ్యూజిక్ ప్లే లిస్ట్ క్రియేట్ చేసే సాహసం చేయను. ఎందుకంటే నేను ఎక్కువగా లవ్ అండ్ సాడ్ సాంగ్స్, పంజాబీ పాటలు వింటుంటాను. మ్యాచ్‌కు ముందు కూడా అవే పాటలు వింటాను. కాబట్టి స్పీకర్ దగ్గరకు వెళ్లి నేను పాటను మార్చే ప్రయత్నం చేయను. నేను వినే పాటలు అక్కడ ప్లే చేస్తే అందరూ 'ఇదేమిటి' అన్నట్లు నన్ను విచిత్రంగా చూస్తారు. అందుకే నేను నా హెడ్సెట్లోనే పాటలు వింటాను' అని స్మృతి పేర్కొంది.
What would be @mandhana_smriti's top three songs if she were to create a playlist inside the dressing room? 🤔@hardikpandya7 helps us find out! 😃👌#NamanAwards pic.twitter.com/WiYGTJuxzP
— BCCI (@BCCI) February 1, 2025
కాగా, గతేడాది అంతర్జాతీయ, డొమెస్టిక్ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లను బీసీసీఐ నమన్ అవార్డులతో సత్కరించింది. ఈ అవార్డుల్లో దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. బీసీసీఐ సచిన్‌ను 'జీవిత సాఫల్య పురస్కారం' (Lifetime Achievement Award)తో గౌరవించింది.
ఇక 2023- 24 సీజన్‌కు గాను ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌గా టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేసింది. అలాగే ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ఎంపికైంది. కాగా, మంధానకు ఈ ఆవార్డు దక్కడం ఇది నాలుగోసారి కావడం విశేషం.
Elegant and consistent as ever with the bat! ✨
— BCCI (@BCCI) February 1, 2025
A year filled with match-winning performances and record-breaking knocks!
Congratulations to #TeamIndia opener and vice-captain Smriti Mandhana who wins the Best International Cricketer - Women Award for the 4️⃣th time 👏👏… pic.twitter.com/8M1qBzcZK6