Ram Charan RC 16 : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. 'RC 16' వర్కింగ్ టైటిల్‌తో ఇది రూపొందుతోంది. యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు పీరియాడిక్ స్టోరీతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక సినిమా నుంచి అప్డేట్ల కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. అదేంటంటే?
సినిమాలో ఓ సీక్వెన్స్ కోసం నెగిటివ్ రీల్ వినియోగించున్నట్టు రత్నవేలు తెలిపారు. 'ఏడెనిమిది ఏళ్ల నుంచి అంతా డిజిటల్ అయ్యింది. కానీ, హాలీవుడ్‌లో మళ్లీ నెగిటివ్ వినియోగించి సినిమా షూట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నెగిటివ్ రీల్‌తో షూటింగ్ చేయడం అంత ఈజీ కాదు. డిజిటల్ కెమెరాలతో షూటింగ్ చేస్తుంటే, నటులు ఎన్ని టేక్స్ తీసుకున్నా సమస్య ఉండదు. అదే నెగిటివ్ ఉండే కెమెరాలతో చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం' అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సన్నివేశం పూర్తిగా నేచురల్‌గా ఉండేదుకు ఇలా చేస్తున్నట్లు చెప్పారు. కాగా, రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'దేవర' సినిమాకు కొంత మేర ఆ ప్రయత్నం చేశానని రత్నవేలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
The journey of #RC16 begins ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) March 20, 2024
Megastar @KChiruTweets Garu clapped for the first shot of #RC16 at the opening ceremony and blessed the entire team ✨
The key people of the project were present and expressed their delight to start working for the film ❤️
Shoot begins soon! pic.twitter.com/VYoZCr4ey3
అసలేంటీ నెగిటివ్ రీల్
పాత రోజుల్లో సినిమా షూటింగ్ కోసం నెగిటివ్ రీల్‌ని వాడేవారు. అందుకోసం నిర్మాతలకు బాగా ఖర్చయ్యేది. రీల్ వృథా కాకూడదని నటీనటులు, దర్శకులు పలు జాగ్రత్తలు తీసుకుంటూ సింగిల్ టేక్‌లో సన్నివేశాల్ని పూర్తి చేసేందుకు ప్రయత్నించేవాళ్లు. డిజిటల్ హవా మొదలయ్యాక నెగిటివ్ రీల్ కనుమరుగైంది. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. షూటింగ్ కోసం అందరూ వాటినే వాడుతున్నారు.
కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆమెకు ఇది తెలుగులో రెండో సినిమా కానుంది. కన్నడ స్టార్ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై సినిమా రూపొందుతోంది.
'RC 16' సెట్స్‌లోకి రామ్ చరణ్! - ఆ స్టార్స్‌తో నయా షెడ్యూల్ - షూటింగ్ ఎప్పుడంటే?