కింగ్ కోబ్రాతో పెంపుడు కుక్కల ఫైట్- యజమాని ప్రాణాలు కాపాడినా! - DOGS FIGHT WITH SNAKE
🎬 Watch Now: Feature Video
Published : Dec 25, 2024, 8:26 AM IST
Dogs Fight With Snake Viral Video : ఛత్తీస్గఢ్లో రెండు పెంపుడు శునకాలు పాము కాటు నుంచి యజమాని, అతడి కుటుంబాన్ని కాపాడాయి! పాముతో విరోచితంగా పోరాడి ఒక కుక్క మృతి చెందగా, మరో శునకం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.
యజమాని ఇంట్లోకి పామును వెళ్లనివ్వకుండా!
ముంగేలిలోని పెండ్రరకపలో నివాసముంటున్న శ్రీకాంత్ గోవర్ధన్ ఇంట్లోకి సోమవారం అర్ధరాత్రి కింగ్ కోబ్రా ప్రవేశించింది. ఆ సమయంలో అతడి ఇంట్లో ఉన్న రెండు కుక్కలు కింగ్ కోబ్రాతో తీవ్రంగా పోరాడాయి. శ్రీకాంత్ ఇంట్లోకి పామును వెళ్లకుండా అడ్డుకున్నాయి. ఈ క్రమంలో శునకాలు మొరిగే శబ్దం విని కుటుంబ సభ్యులు నిద్రలేచారు. అప్పటికే ఒక కుక్క చనిపోగా, మరో శునకం ప్రాణాపాయ స్థితిలో ఉంది. పక్కనే కింగ్ కోబ్రా కూడా చనిపోయి ఉంది. దీంతో ఒక్కసారిగా శ్రీకాంత్ గోవర్ధన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారు. గాయాలతో పడి ఉన్న పెంపుడు కుక్కను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా, పాము- కుక్కల మధ్య జరిగిన ఫైట్ శ్రీకాంత్ గోవర్ధన్ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.