Meals with 130 Different Dishes : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఓ ఆంధ్ర అల్లుడిని ఆ కుటుంబం సంక్రాంతి పండుగ వేళ సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. పెళ్లైన తర్వాత మొదటిసారి అత్తారింటికి వచ్చిన అల్లుడికి 130 రకాల వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేసి అతనిని సంతోషపరిచారు. కాకినాడకు చెందిన అల్లుడికి తెలంగాణ రుచుల రుచి చూపించి ఔరా అనిపించారు.
తెలంగాణ స్టైల్లో ఆంధ్ర అల్లుడికి సర్‌ప్రైజ్ : సరూర్‌నగర్ శారదా నగర్‌లోని నివాసముంటున్న ఖమ్మంపాటి క్రాంతి, కల్పనా దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి ఇందుకు కాకినాడకు చెందిన మల్లిఖార్జున్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిపించారు. మొదటిసారి అల్లుడు మల్లిఖార్జున్ పండుగ నాడు అత్తారింటికి రావడంతో అతకి తెలియకుండా సర్‌ప్రైజ్ చేసేందుకు 130 రకాల వంటలు చేసి వడ్డించారు.
వంటల లిస్ట్ : పిండివంటలు, మాంసాహారం, శాఖాహారం, మిఠాయి, పండ్లు, పులిహోర, బాగారా రైస్‌తోపాటు విభిన్న రకాలుగా వంట తయారు చేసి వడ్డించారు. ఇలా చేయడం మాములుగా ఆంధ్రప్రదేశ్‌లో చూస్తుంటాం. కానీ తెలంగాణలో కూడా చేయడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఆ కుటుంబంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈసారి భోగి ఎంతో ప్రత్యేకం - 110 ఏళ్లకు ఒకసారి ఇలా! - మంటల్లో ఇవి దహనం చేసేద్దాం!