Royal Enfield Hunter 350: ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన రెట్రో-స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ 'హంటర్ 350' అరుదైన ఘనత సాధించింది. అత్యధికంగా సేల్స్‌ను రాబట్టి కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ మోటార్ సైకిల్ ఏకంగా 5 లక్షల యూనిట్ల సేల్స్‌ను దాటి రికార్డ్ సృష్టించింది.
కంపెనీ ఈ మోటార్ సైకిల్‌ను ఆగస్టు 2022లో భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఇది అత్యధిక ప్రజాదరణతో మంచి సేల్స్‌తో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 2023లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హంటర్ 350' 1 లక్ష యూనిట్ల సేల్స్ మార్కును దాటింది. ఆ తర్వాతి ఐదు నెలల్లో ఇది మరో 1 లక్ష యూనిట్ల మార్కును దాటింది. ఈ సేల్స్‌తో ప్రారంభించినప్పటి నుంచి ఈ మోటార్ సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్ సైకిళ్లలో ఒకటిగా నిలిచింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ధర: భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. దీంతో ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యంత చౌకైన మోటార్‌సైకిల్‌గా మారడం గమనించదగ్గ విషయం.
భారత మార్కెట్‌తో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, అర్జెంటీనా, కొలంబియాలో కూడా అమ్ముడవుతోంది. వీటితోపాటు ఈ మోటార్ సైకిల్ మెక్సికో, ఆస్ట్రేలియా, బ్రెజిల్, న్యూజిలాండ్‌లో కూడా సేల్ అవుతోంది.
పవర్‌ట్రెయిన్: దీని పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడుకుంటే ఈ మోటార్‌సైకిల్ 'క్లాసిక్ 350', 'మీటియోర్ 350' మోడల్స్‌లో ఉన్న ఇంజిన్‌నే కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ అదే 349cc ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. అయితే 'హంటర్ 350' ఫీచర్లకు అనుగుణంగా దీన్ని మరింత షార్ప్, రెస్పాన్సివ్‌గా ట్యూన్ చేశారు.
దీని 349cc, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్ ఎయిర్-ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 6,100rpm వద్ద 20.11bhp శక్తిని, గరిష్టంగా 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత అయి వస్తుంది. ఈ ఇంజిన్ మంచి సౌండ్‌తో స్మూత్ డ్రైవింగ్‌ను ఇస్తుంది.
కలర్ ఆప్షన్స్: ఈ హంటర్ 350 మొత్తం మూడు వేరియంట్లలో అమ్ముడవుతోంది. వీటిలో అనేక కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
- ఫ్యాక్టరీ బ్లాక్
- డాపర్ వైట్
- డాపర్ గ్రే
- రెబెల్ బ్లాక్
- రెబెల్ బ్లూ
- రెబెల్ రెడ్
గతేడాది రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇందులో డాపర్ ఆరెంజ్, డాపర్ గ్రీన్ అనే మరో రెండు కొత్త కలర్స్‌ను జోడించింది.
గ్లోబల్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్- చౌక ధరకు ఎక్కడ లభిస్తాయంటే?
రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు షాక్- ఆ మోడల్ సేల్స్‌ను నిలిపివేసిన కంపెనీ!
కొత్త కారు కొనాలా?- అయితే వెంటనే త్వరపడండి- ఆలస్యం చేస్తే ఇక బాదుడే!