How To Keep SIM Active With Rs20 : మనలో చాలా మంది రెండేసి సిమ్ కార్డ్‌లు వాడుతుంటారు. అయితే కొందరు వాటిలో ఒకదాన్ని ఎప్పుడూ వాడుతూ, మరోదాన్ని మాత్రం అట్టేపెడుతుంటారు. ఇలా రెండో సిమ్‌ను ఎక్కువ కాలం వాడకుండా వదిలేస్తే, అంటే దానిని రీఛార్జ్ చేయకపోతే అది డీయాక్టివేట్ అయిపోతుంది. మీరు దాన్ని మళ్లీ పొందాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకే ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ, ఇటీవల ట్రాయ్ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. కేవలం రూ.20తో మీ సిమ్‌ను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకునేలా ఈ రూల్ తీసుకొచ్చింది. డ్యూయెల్ సిమ్ యూజర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
గతంలో సిమ్ కార్డ్‌లను యాక్టివ్‌గా ఉంచుకోవడం కోసం చాలా మంది ప్రతి నెలా కనీస మొత్తాన్ని రీఛార్జ్ చేసుకునేవారు. అయితే ఈ రీఛార్జ్‌కు అయ్యే డబ్బు చాలా ఎక్కువగా ఉండేది. ఈ సమస్యను తొలగించడానికి ట్రాయ్ ఇకపై కేవలం రూ.20తో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకునేలా నిబంధలను మార్చింది.
ఇది ఎలా పనిచేస్తుందంటే?
- మన దగ్గరున్న సిమ్ కార్డ్ నుంచి ఎలాంటి కాల్స్, మేసేజ్‌లు చేయకుండా, డేటా వాడకుండా ఉండి, ఎలాంటి రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకోకుండా ఉంటే, అది 90 రోజుల తరువాత డీయాక్టివేట్ అయిపోతుంది.
- కొత్త రూల్ ప్రకారం, ఇలా 90 రోజుల పాటు మీ సిమ్ కార్డ్‌ను వాడకుండా ఉన్నా ఫర్వాలేదు. మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా రూ.20 కట్ అవుతుంది. అప్పటి నుంచి మీ సిమ్ కార్డ్ మరో 30 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది.
- మీ ఖాతా రూ.20 లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు ఉన్నంత వరకు ఈ ప్రక్రియ ఇలానే కొనసాగుతుంది. కనుక మీ సిమ్ డీయాక్టివేట్ అయ్యే అవకాశమే ఉండదు.
- ఒకవేళ మీ ఖాతాలోని బ్యాలెన్స్ రూ.20 కంటే తక్కువగా ఉంటే, మీ సిమ్ కార్డ్ డీయాక్టివేట్ అయిపోతుంది. కనుక మీ ఖాతాలో కనీసం రూ.20 ఉంచుకోవడం బెటర్. ఈ సింపుల్ టెక్నిక్ వాడితే, మీ సిమ్ డీయాక్టివేట్ అయ్యే అవకాశమే ఉండదు.
- ఒక వేళ మీ సిమ్ కార్డ్ డీయాక్టివేట్ అయిపోతే, 15 రోజుల్లోపు మళ్లీ రూ.20తో రీఛార్జ్ చేసుకుంటే చాలు. ఆ సిమ్ కార్డ్ మళ్లీ యాక్టివేట్ అవుతుంది.
నోట్ : ఈ రూల్ కేవలం ప్రీపెయిడ్ కనెక్షన్ ఉన్న యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.