మహిళను హిప్నటైజ్ చేసి బంగారం చోరీ? పట్టపగలు నడిరోడ్డుపైనే గాజులు మాయం! - WOMAN HYPNOTISED AND ROBBED
🎬 Watch Now: Feature Video
Published : Dec 25, 2024, 7:42 PM IST
|Updated : Dec 25, 2024, 7:50 PM IST
Woman Hypnotised And Robbed : పట్టపగలు, నడిరోడ్డులో ఓ మహిళను హిప్నటైజ్ చేసి బంగారు గాజులు దోచుకున్నారన్న వార్త ఉత్తరాఖండ్ రుద్రపుర కొత్వాల్లోని ఉద్ధమ్సింగ్ నగర్లో చర్చనీయాంశమైంది. సంబంధిత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం- రమా రాణి అనే మహిళ డిసెంబర్ 23న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తుండగా, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను వెంబడించారు. వారిలో ఒకరు బాధిత మహిళ దగ్గరకు వచ్చి, ఆమె కాళ్లకు నమస్కారం చేశాడు. తరువాత ఆమెతో ఏదో మాట్లాడాడు. అంతే ఆమె అతనిని అనుసరించి వెళ్లింది. తరువాత ఆ ముగ్గురు కలిసి ఆమె చేతికి ఉన్న నాలుగున్న తులాల బంగారు గాజులను దోచుకున్నారు. దీనితో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను హిప్నటైజ్ చేసి బంగారాన్ని దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనితో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.