బట్టతల చికిత్స @రూ.20- 8రోజుల్లోనే రిజల్ట్! - ట్రీట్మెంట్ కోసం ఎగబడ్డ జనం - BALDNESS TREATMENT IN MEERUT
🎬 Watch Now: Feature Video
Published : 3 hours ago
Baldness Cure For Rs 20 in Meerut : కేవలం రూ.20లకే బట్టతలకి చికిత్స చేస్తున్నారని తెలియగానే ప్రజలు ఒక్కసారిగా బారులు తీశారు. రోడ్లపై క్యూ కట్టారు. దీంతో ట్రామ్ జామ్ అవ్వడం వల్ల అంబులెన్స్ కూడా దారి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
డిసెంబర్ 15(ఆదివారం) మేరఠ్‌లోని లిసాడీ గేట్ అనే ప్రాంతంలో సల్మాన్ అనే వ్యక్తి మరికొంతమందితో కలిసి రూ.20లకే బట్టతల చికిత్స చేశారు. అందుకు సంబంధించిన మందు రూ.300లకు ఇచ్చారు. కేవలం 8 రోజుల్లోనే జట్టు వస్తుందని ప్రచారం చేశారు. బట్టతలకే కాకుండా జట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతున్న వారికి చికిత్సను అని చెప్పారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భారీ ఎత్తున తరలి వచ్చారు. రోడ్లపై క్యూలో నిలబడి మరి చికిత్స చేయించుకున్నారు. ఒక్కొక్కరిగా వచ్చి ఆ మందును తలకు రాయించుకున్నారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి వెళ్లగా అక్కడ ఎవరూ కనిపించలేదని దీనిపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.