ETV Bharat / offbeat

సెరామిక్ పాత్రలను ఇలా శుభ్రం చేయండి - ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయట! - HOW TO CLEAN CERAMIC UTENSILS

మీ ఇంట్లో సెరామిక్ పాత్రలు వాడుతున్నారా? - ఇలా క్లీన్ చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయంటున్న నిపుణులు!

Ceramic Utensils Cleaning Tips
Cleaning Tips for Ceramic Utensils (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2025, 5:55 PM IST

Cleaning Tips for Ceramic Utensils : ప్రస్తుత రోజుల్లో చాలా మంది నాన్​స్టిక్ పాత్రల​తో పాటు సెరామిక్ కుక్​వేర్​ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవి చూడటానికి అందంగా ఉండటంతో పాటు వండేందుకూ అనుకూలం. ముఖ్యంగా ఇంటికి బంధువులొచ్చినప్పుడు వీటిల్లో వడ్డించడం ద్వారా హుందాతనం ఉట్టిపడుతుంది. ఈ పాత్రల్లో భోజనం చేయడం కూడా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే, వీటిని వాడడం వరకే కాదు శుభ్రపరిచే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే అవి ఎక్కువ కాలం మన్నుతాయని చెబుతున్నారు. ఇంతకీ, సెరామిక్‌ వంట పాత్రల్ని ఎలా శుభ్రం చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

  • కొంతమంది టైమ్ లేకపోవడం వల్లో లేదంటే త్వరగా పని కంప్లీట్ అవ్వాలన్న ఉద్దేశంతోనో సెరామిక్‌ పాత్రల్ని వేడిగా ఉన్నప్పుడే క్లీన్ చేస్తుంటారు. వాటర్ ట్యాప్ కింద పెడితే అవే చల్లబడతాయనుకుంటారు. అయితే, ఇలా ఉన్నట్లుండి టెంపరేచర్​లో మార్పు రావడం వల్ల వాటిపై ఉండే నాన్‌స్టిక్‌ సెరామిక్‌ కోటింగ్‌ తొలగిపోతుందంటున్నారు నిపుణులు. కాబట్టి, వంట పూర్తయ్యాక అవి సాధారణ గది ఉష్ణోగ్రత వద్దకొచ్చాక మాత్రమే వాటిని క్లీన్ చేయాలని సూచిస్తున్నారు.
  • వంట త్వరగా పూర్తవ్వాలన్న ఉద్దేశంతో కొందరు ఎక్కువ మంట మీద వంట చేస్తుంటారు. అయితే, సెరామిక్‌ పాత్రల్ని ఇలా పెద్ద మంటపై ఉంచితే వాటిలోని నాన్‌స్టిక్‌ కోటింగ్‌ త్వరగా పోతుందని గుర్తుంచుకోవాలి. అందుకే, ఈ పాత్రల్లో చిన్న మంట పైనే వంట చేయడం మంచిదంటున్నారు నిపుణులు.
  • సెరామిక్‌ పాత్రలపై కొన్నిసార్లు పసుపు మరకలు పడుతుంటాయి. అవి అంత ఈజీగా తొలగిపోవు. అలాంటి టైమ్​లో మరకలు ఉన్న పాత్రలో కొద్దిగా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ పోసి అరగంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత డిటర్జెంట్‌తో క్లీన్ చేస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.

ఎంత శుభ్రం చేసినా పాత్రల్లో పసుపు మరకలు పోవడం లేదా ? ఇలా చేస్తే చిటికెలో సాల్వ్​!

  • నార్మల్​గా సెరామిక్‌ వంట పాత్రలపై ఉన్న నాన్‌స్టిక్‌ కోటింగ్‌ అందులో వండే పదార్థాల్ని మాడిపోనివ్వదు. అయినా మాడిపోకుండా ముందే వెన్న పూయడం వంటివి చేయాలంటున్నారు.
  • ఒకవేళ సెరామిక్‌ పాత్రలు మాడిపోయినట్లయితే ఈ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకోసం మాడిపోయిన పాత్రలో కొద్దిగా పొడి బేకింగ్‌ సోడాను చల్లాలి. ఆపై మృదువుగా ఉన్న స్పాంజితో గుండ్రంగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత సాధారణ డిటర్జెంట్‌తో కడిగేస్తే సరిపోతుందంటున్నారు. లేదంటే ఈ పాత్రల్ని బేకింగ్‌ సోడా, గోరువెచ్చటి నీళ్ల మిశ్రమంతో శుభ్రం చేసినా గుడ్ రిజల్ట్ ఉంటుందంటున్నారు.
  • మరో టిప్ ఏంటంటే, ఒక పాత్రలో ఒక వంతు వెనిగర్​కు నాలుగు వంతుల వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని శుభ్రం చేయాల్సిన సెరామిక్‌ పాత్రలో పోసి రాత్రంతా నానబెట్టాలి. మార్నింగ్ సబ్బుతో క్లీన్ చేస్తే సరి. వంట చేసే క్రమంలో వాటిపై ఏర్పడిన మరకలు, జిడ్డుదనం అన్నీ తొలగిపోయి కొత్తవాటిలా మెరుస్తాయంటున్నారు నిపుణులు.

డిష్​వాష్​ బార్, లిక్విడ్ వద్దనుకుంటున్నారా? పాత్రలను ఇలా శుభ్రం చేయండి!

  • ఈ టిప్ కూడా సెరామిక్ బౌల్స్​ని మెరిపించడంలో మంచిగా పనిచేస్తుంది. ఒక చిన్న గిన్నెలో టేబుల్‌స్పూన్‌ చొప్పున ఉప్పు, వెనిగర్‌ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో ముందుగా సెరామిక్‌ పాత్రలు/ప్లేట్స్‌ క్లీన్ చేసి ఆ తర్వాత డిటర్జెంట్‌తో కడిగేస్తే సరి.
  • సెరామిక్‌ ప్లేట్స్‌లో ఆహార పదార్థాలు కట్‌ చేయడం, వాటిపై పడిన మరకలు తొలగిపోవాలని గరుకైన స్క్రబ్బర్‌తో రుద్దడం వంటివి చేయొద్దు. ఇలా చేయడం ద్వారా వాటిపై ఉండే నాన్‌స్టిక్‌ కోటింగ్‌ తొలగిపోయి గీతలు పడతాయి. ఫలితంగా అవి త్వరగా పాడైపోతాయంటున్నారు.
  • అలాగే, సెరామిక్‌ పాత్రలు ఎక్కువ కాలం మన్నాలంటే వాటిని భద్రపరిచేటప్పుడూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కడిగిన పాత్రల్ని తేమగా ఉన్నప్పుడు కాకుండా ఒక కాటన్‌ క్లాత్‌తో వాటిని పొడిగా తుడిచి, కాసేపు గాలికి పూర్తిగా ఆరాకే వాటిని అల్మరాలో భద్రపరచాలంటున్నారు నిపుణులు.

కిచెన్​లో గిన్నెలు, ప్లేట్లే కాదు.. ఇవి కూడా క్లీన్​ చేయాలి! - లేకపోతే బ్యాక్టీరియా ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.