ETV Bharat / state

జేఎన్​టీయూ విద్యార్థులకు గుడ్​ న్యూస్ - విదేశాల్లో జాబ్​ కొట్టేందుకు ఓ చక్కటి అవకాశం - OPPORTUNITIES FOR JNTU STUDENTS

జేఎన్‌టీయూ విద్యార్థులకు విదేశాల్లో ఉపాధి అవకాశాల కల్పనకు కసరత్తు - పూర్వ విద్యార్థుల సహకారంతో ఇంటర్న్‌షిప్‌లు

Employment Opportunities Abroad For JNTU Students
Employment Opportunities Abroad For JNTU Students (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2025, 5:39 PM IST

Employment Opportunities Abroad For JNTU Students : జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(JNTU)లోని ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఇతర దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడానికి యూనివర్సిటీ అధికారులు వినూత్న కార్యాచరణ సిద్ధం చేశారు. విదేశాల్లో ఉన్నత స్థాయి జాబ్స్​ చేస్తూ సాఫ్ట్‌వేర్‌ సంస్థల అధిపతులుగా ఉన్న పూర్వ విద్యార్థుల సహాయంతో ఇక్కడి విద్యార్థులకు ఫెలోషిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, జాబ్స్​ ఇప్పించేలా అభ్యర్థించనున్నారు.

ఫిబ్రవరి 8, 9 తేదీల్లో గ్లోబల్‌ అలుమ్నీ మీట్‌ : ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో ప్రతిభ ఉన్న వినూత్న నైపుణ్యాలు, ఆలోచనలు లేకపోవడంతో చాలా మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. దీంతో కొద్ది నెలలుగా బహుళజాతి సంస్థలు ప్రాంగణ నియామకాలపై ఆసక్తి చూపడం లేదు. ఈ అంశాలను గమనించిన జేఎన్‌టీయూ అధికారులు ఇతర దేశాల్లోని పూర్వ విద్యార్థులను సంప్రదించారు. వారు సకారాత్మకంగా స్పందిస్తారనే భావనతో ఫిబ్రవరి 8, 9 తేదీల్లో క్యాంపస్‌లో జరగనున్న గ్లోబల్‌ అలుమ్నీ మీట్‌ వేదికగా చేసుకున్నారు.

విశ్వవ్యాప్త అనుసంధానం : -

  • అలుమ్నీకి ఇతర దేశాల్లో ఉంటున్న 18,000 మంది పూర్వ విద్యార్థులు వచ్చే అవకాశాలు ఉండటంతో వారితో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ప్రస్తుత విద్యార్థుల్లో అర్హులైన వారి ప్రతిభను వివరించనున్నారు.
  • గత విద్యార్థుల వృత్తి, వ్యక్తిగత వివరాలను విశ్వవిద్యాలయం అధికారులు సేకరించి విశ్వ వ్యాప్త అనుసంధానం చేయనున్నారు.
  • ఇక్కడి పూర్వ విద్యార్థులు 30 శాతం మంది సొంతంగా సాఫ్ట్‌వేర్, ఇతర సంస్థలను నిర్వహిస్తుండగా, 70 శాతం మంది బహుళజాతి సంస్థల్లో సీవోవోలు, సీఈవోలుగా పని చేస్తున్నారు.
  • విద్యా రంగంలో వస్తున్న మార్పులు, చేర్పులు పరిశోధనలను గ్లోబల్‌ కనెక్టివిటీ ద్వారా మరింత పెంపొందించనున్నారు. పరిశోధనలు, శాస్త్రీయ, ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో వారి సహకారం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
  • ఒక్కో దేశం, ప్రాంతంలో నివాసం ఉంటున్న పూర్వ విద్యార్థుల్లో ఒకరిద్దరిని ప్రతినిధులుగా నియమించి వారితో ఇక్కడ ఉన్న విశ్వవిద్యాలయం అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా సమావేశాలను నిర్వహించనున్నారు.
  • జేఎన్‌టీయూలో చదివి ఇతర దేశాల్లో స్థిరపడిన గత విద్యార్థుల్లో ఎక్కువ మంది అమెరికాలో ఉన్నారు.
  • ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్‌లో చాలా మంది ఉన్నారు.

విదేశీ వర్సిటీల్లో ఫెలోషిప్‌లు : ఇతర దేశాల్లోని పూర్వ విద్యార్థులను కలిసి జేఎన్‌టీయూ విద్యార్థులకు వారి సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఇవ్వాలని కోరతామని జేఎన్‌టీయూ ఇన్‌ఛార్జి వీసీ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులకు విదేశీ వర్సిటీల్లో ఫెలోషిప్‌లు ఇప్పించేందుకు సహకారమందించాలని వివరాలతో కూడిన జాబితాను అందించనున్నామని ఆయన అన్నారు.

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అలర్ట్ - సిలబస్‌లో సమూల మార్పులు

ఈ కాలేజీలో సీటు దొరికితే ఉద్యోగం వచ్చినట్లే! - కోర్సు పూర్తయ్యే నాటికి చేతిలో కొలువు పక్కా!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.