How to Reduce Double chin : బ్యూటీ విషయంలో ఎంత కేర్ తీసుకున్నప్పటికీ కొన్ని సమస్యలు ముఖం రూపాన్నే దెబ్బతీస్తుంటాయి. అలాంటి వాటిలో "డబుల్ చిన్" ఒకటి. గడ్డం దగ్గర కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ఒక అదనపు లేయర్‌లా కనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు జనాల్లోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే డబుల్ చిన్‌ను ఈజీగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
అసలు ఎందుకొస్తుంది?
డబుల్ చిన్ ఎందుకు వస్తుంది అంటే, 3 కారణాలున్నాయని అంటున్నారు నిపుణులు. అందులో ఒకటి అధిక బరువు. ఉన్నట్టుండి బరువు పెరిగినా, లేదా తగ్గినా ఈ సమస్య వస్తుందట. వెయిట్ పెరిగినప్పుడు గడ్డం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, తగ్గినప్పుడు చర్మం లూజ్‌గా మారడమే కారణం అంటున్నారు.
వయసు పైబడిన వారికీ ఈ సమస్య వస్తుందట. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ముఖం కండరాలు పటుత్వాన్ని కోల్పోతుంటాయి. అందువల్ల గడ్డం వద్ద కొవ్వు పేరుకుపోవడం, చర్మం వదులు కావడం వల్ల కూడా "డబుల్ చిన్" వస్తుందట!
మూడో కారణం వంశపారంపర్యం. జన్యుపరమైన కారణాలతోనూ డబుల్ చిన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ చిట్కాలతో ఉపశమనం :
డబుల్ చిన్ తో ఇబ్బంది పడేవారు ఆహారం బాగా నమిలి తినాలి. దీనివల్ల ముఖ కండరాలు బలంగా తయారవుతాయి. కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ముఖాకృతి చక్కగా ఉంటుంది. అలాగే మార్కెట్లో షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ దొరుకుతాయి. వాటిని నమలడం కూడా మంచిదేనని అంటున్నరాు. దీనివల్ల దవడల వద్ద పేరుకున్న కొవ్వు కరిగే ఛాన్స్ ఉంటుంది.
గుడ్డు తెల్లసొన :
రెండు గుడ్లు తీసుకోండి. వాటిల్లోంచి తెల్లసొన మాత్రమే సేకరించి, టేబుల్‌స్పూన్ పాలు, కాస్త తేనె, నిమ్మరసం యాడ్ చేయండి. బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని డబుల్ చిన్ మీద ప్యాక్ వేసుకోండి. అర గంట సేపు ఆరనిచ్చి, ఆ తర్వాత గోరువెచ్చని వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. తెల్లసొన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఇలా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే డబుల్ చిన్ క్రమంగా తగ్గుతుంది. గుడ్డు స్మెల్ నచ్చకపోతే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు.
గ్రీన్ టీ :
గ్రీన్ టీ శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. కాబట్టి కాఫీ, టీలకు బదులుగా గ్రీన్ టీని డైట్‌లో చేర్చుకుంటే డబుల్ చిన్‌ను క్రమంగా తగ్గించుకోవచ్చు.
విటమిన్ "ఇ" :
మనం నిత్యం తినే ఆహారంలో విటమిన్ E ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఆకుకూరలు, బ్రౌన్ రైస్, స్వీట్ కార్న్, పాల ఉత్పత్తులు, సోయా బీన్స్, యాపిల్, పప్పు దినుసులు వంటి వాటిల్లో E విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని రోజూ వారీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి. అలాగే కేలరీలు, కొలెస్ట్రాల్ లేని ఫుడ్ తినేలా జాగ్రత్తపడాలి.
వ్యాయామం : ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా ప్రాక్టీస్ చేయాలి. మెడను నెమ్మదిగా గుండ్రంగా కాసేపు తిప్పాలి. కిందకు-పైకి కదిలించాలి. ఇలాంటి చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.