Auto Expo 2025 Bikes : భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ బైక్‌లను ప్రదర్శిస్తున్నాయి. వాటిలో హీరో, సుజుకి, యమహా లేటెస్ట్ బైక్స్ కూడా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
1. Gixxer SF 250 : ఆటో ఎక్స్‌పో 2025 సందర్భంగా గిక్సర్ ఎస్‌ఎఫ్ 250ని లాంఛ్ చేశారు. దీని ధర రూ.2.17 లక్షలుగా ఉంది.
2. Suzuki E Access : సుజుకి కంపెనీ ఈ ఎక్స్‌పో సందర్భంగా ఈ-యాక్సెస్‌ను ప్రదర్శించింది. దీని డ్రైవింగ్ రేంజ్ 95 కి.మీ ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇండియన్ ఈవీ మార్కెట్లో వచ్చిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీల్లో ఇది ఒకటని కంపెనీ అంటోంది.
3. Hero Xoom 160 : ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో - ఈ ఆటో ఎక్స్‌పో2025 సందర్భంగా 'హీరో జూమ్ 160' స్కూటీని లాంఛ్ చేసింది. యమహా ఏరోక్స్ 155కి ఇది గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. దీని ధర రూ.1.49 లక్షల వరకు ఉంటుంది.
4. Hero Xoom 125 : హీరో జూమ్ 125 స్కూటీని కూడా ఈ ఈవెంట్ సందర్భంగానే లాంఛ్ చేశారు. దీని ధర సుమారుగా రూ.86,900. ఈ బైక్ బుకింగ్స్ ఫిబ్రవరి నుంచి, డెలివరీ మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి.
5. Hero Xtreme 250R : సూపర్ స్టైలిష్‌గా ఉండి, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ కూడా లాంఛ్ అయ్యింది. ఈ బైక్ ధర రూ.1,79,900గా నిర్ణయించారు.
6. Hero Xpluse 210 : హీరో కంపెనీ లాంఛ్ చేసిన బెస్ట్ బైక్ హీరో ఎక్స్‌ప్లస్ 210. దీని ధర రూ.1.76 లక్షలు. ఈ విధంగా ఆటో ఎక్స్‌పోలో హీరో కంపెనీ పలు బెస్ట్ స్కూటర్స్, బైక్స్ విడుదల చేసింది.
7. Yamaha Lander 250 : బైక్ లవర్స్ కోసం యమహా కంపెనీ ల్యాండర్ 250ని తీసుకొచ్చింది. ఆటో ఎక్స్‌పోలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఎక్స్‌పోలో టీవీఎస్, ఎంజీ, బీఎండబ్ల్యూ సహా అనేక ఇతర కంపెనీలు కూడా తమ లేటెస్ట్ హైబ్రిడ్, ఈవీ, పెట్రోల్ బైక్‌లను, స్కూటీలను ప్రదర్శించాయి.
బేసిక్ కార్ నాలెడ్జ్ - వీటి గురించి తెలిస్తే చాలు - మీ బండి మెయింటెనెన్స్ చాలా ఈజీ!