ETV Bharat / state

సికింద్రాబాద్‌ నుంచి మహా కుంభమేళాకు స్పెషల్ ట్రైన్ - టికెట్ ధర ఎంతో తెలుసా? - SOUTH CENTRAL RAILWAY SPECIAL TRAIN

కుంభమేళాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలును ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే - ఫిబ్రవరి 15న సికింద్రాబాద్‌లో బయలుదేరి తిరిగి 22న హైదరాబాద్ నగరానికి చేరుకొనున్న ప్రత్యేక రైలు

SOUTH CENTRAL RAILWAY SPECIAL TRAIN
SPECIAL TRAIN FOR KUMBHMELA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2025, 2:59 PM IST

Updated : Jan 18, 2025, 3:05 PM IST

Special Train From Secunderabad to KumbhMela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్న కుంభమేళాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. ఫిబ్రవరి 15న ఈ రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరి తిరిగి అదే నెల 22న హైదరాబాద్ నగరానికి చేరుకుంటుంది. మొత్తం 8 రోజుల పాటు సాగే ఈ యాత్రలో వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌ రాజ్‌లను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ ప్యాకేజీని రూపొందించింది. ఎకానమీ క్లాస్‌లో పెద్దలకు రూ. 23,035, 11 ఏళ్ల లోపు పిల్లలకు రూ. 22,140గా టికెట్ ఛార్జీలను నిర్ణయించారు. 15 తేదిన సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు 18న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుంది.

19వ తేదిన వారణాసిలో కాశీవిశ్వనాథ్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలను భక్తులు దర్శించుకుని అదే రోజు ప్రయాణికులు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం 20న అయోధ్య చేరుకుంటారు. అక్కడ శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హిని సందర్శించిన అనంతరం రైలు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. 22న రాత్రి వరకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస, బ్రహ్మపూర్‌ (బరంపురం), చత్రపూర్‌, కుర్దారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, భద్రక్‌, బాలాసూర్‌ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

రైలు ప్రయాణంలో ఇబ్బందులా? - ఈ టోల్‌ ఫ్రీ నంబర్​కు కాల్‌ చేస్తే చిటికెలో సాల్వ్

సికింద్రాబాద్‌ నుంచి 'మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర' - మరో పర్యాటక రైలును ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

Last Updated : Jan 18, 2025, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.